Advertisement

డైలాగ్ కింగ్ వదిలిన ‘కాలేజ్ కుమార్’ ట్రైలర్

Sun 23rd Feb 2020 07:36 PM
sai kumar,college kumar,trailer,launch  డైలాగ్ కింగ్ వదిలిన ‘కాలేజ్ కుమార్’ ట్రైలర్
College Kumar Trailer Launch Details డైలాగ్ కింగ్ వదిలిన ‘కాలేజ్ కుమార్’ ట్రైలర్
Advertisement

డైలాగ్ కింగ్ సాయి కుమార్ చేతుల మీదుగా కాలేజ్ కుమార్ ట్రైలర్ లాంచ్ !!!

ఎమ్ ఆర్  పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ గౌడా సమర్సణలో ఎల్ పద్మనాభ నిర్మించిన చిత్రం కాలేజ్ కుమార్. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ మూవీని తెలుగులో రిమేక్ చేసాడు దర్శకుడు హరి సంతోష్. రాహుల్ విజయ్, ప్రియ వడ్డమాని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో నట కిరీటి రాజంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ సాయి కుమార్ చేతులు మీదుగా జరిగింది. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో  చిత్ర యూనిట్ పాల్గొంది.

ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ... కాలేజ్ కుమార్ సినిమాకి ప్రతి తండ్రి కనెక్ట్ అవుతారు. నేను ఈ సినిమాలో ఒక మంచి పాత్ర చెయ్యాల్సి ఉంది. కానీ కుదరలేదు. ఆ పాత్రను నా తమ్ముడు రవి చేసాడు, తనకు ఈ సినిమా మంచి బ్రేక్ అవుతుంది. డైరెక్టర్ నాతో ఈ సినిమాను తెలుగులో చేస్తున్నాను అన్నప్పుడు సంతోషంగా ఫీల్ అయ్యాను. విజయ్ మాస్టార్ అబ్బాయి రాహుల్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడని తెలిసి మరింత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ సినిమాలో మంచి ఫీల్ ఉంటుంది. అలాగే ఎమోషన్స్ బాగున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమా విడుదల అవ్వడం ఇలా అన్ని ఈ సినిమాకు కుదిరాయి. చిత్ర యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. మార్చి 6న ఈ సినిమా అందరూ చూసి ఆశీర్వదించండని తెలిపారు.

డైరెక్టర్ హరి సంతోష్ మాట్లాడుతూ... మా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సాయి కుమార్ గారికి ధన్యవాదాలు. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా, ఆడియన్స్ అందరికి నచ్చే విధంగా ఈ మూవీ ఉండబోతోంది అనుకుంటున్నాను. ఈ సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలని తెలిపారు.

ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ... ఫైట్ మాస్టర్ గా నన్ను సపోర్ట్ చేశారు. ఇప్పుడు మా అబ్బాయిని అభినందిస్తున్నారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ సంస్థ విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. రాజేంద్రప్రసాద్ గారితో మాకు మంచి రిలేషన్ ఉంది. ఆయన ఈ సినిమాలో తన బెస్ట్ ఇచ్చారు. ఈ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన సాయి కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి సపోర్ట్ ఇలానే మాకు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ... రాజేంద్రప్రసాద్ గారు సినిమా చేస్తున్నారు అంటే ప్రేక్షకుల్లో ఒక అంచనా ఉంటుంది. ఈ సినిమాతో రాహుల్ విజయ్ పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ హరి సంతోష్ ట్యాలెంటెడ్ డైరెక్టర్. తాను చేసిన సినిమాలకు చాలా అవార్డ్స్ వచ్చాయి. తన తొలి తెలుగు సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.

హీరోయిన్ ప్రియ వడ్లమని మాట్లాడుతూ... నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మార్చి 6న విడుదల కానున్న మా సినిమాను ఆడియన్స్ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా అన్నారు.

రాహుల్ విజయ్ మాట్లాడుతూ... కాలేజ్ కుమార్ ట్రైలర్ అందరికి నచ్చినందుకు సంతోషంగా ఉంది. సురేష్ ప్రొడక్షన్ వారు మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ గారితో నటించడం సంతోషంగా ఉంది. ఒక మంచి సబ్జెక్ట్ తో డైరెక్టర్ గారు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా కాలేజ్ కుమార్ అవుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా అన్నారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... రాహుల్ విజయ్ తన నటన ప్రతిభను చూపించాడు. సాయి కుమార్ నేను అద్భుతమైన స్నేహితులం ఈరోజు తాను కాలేజ్ కుమార్ ట్రైలర్ ను విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. కన్నడలో పెద్ద సక్సెస్ అయిన ఈ సినిమా తెలుగులో కాలేజ్ కుమార్ పేరుతో విడుదలవ్వడం విశేషం. ఈ సినిమాలో మర్చిపోలేని పాత్రలో నటించాను. రాహుల్ విజయ్ నా కుమారుడి పాత్రలో అద్భుతంగా నటించాడు. మంచి సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. సెంటిమెంట్, ఫన్ ఇలా అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. రెగ్యులర్ పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో నా పాత్ర ఉండబోతోంది. మార్చి 6న విడుదల కానున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా అన్నారు.

బ్యానర్: ఎమ్ ఆర్ పిక్చర్స్.

సమర్పణ: లక్ష్మణ గౌడ

ప్రొడ్యూసర్:  ఎల్. పద్మనాభ

డైరెక్టర్: హారి సంతోష్

డిఓపి: గురు ప్రశాంత్ రాజ్

మ్యూజిక్: కుతుబ్ ఇ క్రిప

ఎడిటర్: గ్యారీ బి. హెచ్. పవన్ కుమార్

స్టంట్స్: విజయ్

పిఆర్ ఓ: జియస్ కె మీడియా

డైలాగ్స్: సందీప్ రాజ్

నటీ నటులు: రాహుల్ విజయ్ , ప్రియ వడ్లమాని, రాజేంద్ర ప్రసాద్ , మధుబాల తదితరులు

College Kumar Trailer Launch Details:

Sai Kumar Launches College Kumar Trailer

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement