‘ఓ పిట్ట క‌థ’ ట్రీట్ ఎప్పుడంటే..?

Sun 16th Feb 2020 11:24 PM
o pitaa katha,release date,bhavya creations,anand prasad,pooja hegde  ‘ఓ పిట్ట క‌థ’ ట్రీట్ ఎప్పుడంటే..?
O Pitaa Katha Movie Release Date fixed ‘ఓ పిట్ట క‌థ’ ట్రీట్ ఎప్పుడంటే..?
Sponsored links

‘ఓ పిట్ట క‌థ’ సాంగ్‌కి అద్భుత స్పంద‌న‌  

అగ్ర నిర్మాణ సంస్థ  భవ్య క్రియేషన్స్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఓ పిట్ట కథ’. ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకుడు. వి.ఆనందప్రసాద్‌ నిర్మాత. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు హీరోలుగా, నిత్యాశెట్టి హీరోయిన్‌గా న‌టించారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజైన టీజర్‌కి అద్భుత స్పంద‌నవ‌చ్చింది. ‘ఏమై పోతానే.. మనసిక ఆగేలా లేదే’ అంటూ సాగే మెలోడీ పాటను ‘బుట్టబొమ్మ‌’ పూజా హెగ్డే  చేతుల‌మీదుగా వేలెంటైన్స్ డే రోజున విడుద‌ల చేయ‌గా ఫీల్ గుడ్సాంగ్  అన్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. 

ఈ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌లో ఓ ఆస‌క్తిక‌ర‌ సంగ‌తిని నిర్మాత ఆనంద ప్ర‌సాద్ వెల్ల‌డించారు. ఆనంద్ ప్ర‌సాద్ మాట్లాడుతూ.. ‘‘ఈ పాట‌ను అమ‌లాపురం, కాకినాడ ప‌రిస‌రాల్లో చిత్రీక‌రించాం. పాట చిత్రీక‌ర‌ణ‌లో ఓ త‌మాషా ఉంది. మూవీలో స‌న్నివేశం మూడ్‌కి త‌గ్గ‌ట్టుగా అక్కడ లొకేష‌న్ల‌లో విజువ‌ల్స్‌ని తెర‌కెక్కించాం. తొలుత‌ విజువ‌ల్స్ షూట్ చేశాకే హైద‌రాబాద్ లో ట్యూన్ క‌ట్టాం. ఇలా ఇంత‌కుముందు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వంశీ ‘లేడీస్ ట్రైల‌ర్’ కోసం ‘ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే’ పాటలో ప్ర‌యోగం చేశారు. విజువ‌ల్స్ షూట్ చేసాక ఇళ‌య‌రాజాతో ఆ బాణీని సిద్ధం చేయించారు వంశీ గారు. ఆ తరహాలోనే మేం చేసిన ప్ర‌యోగం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుందని భావిస్తున్నాం. మార్చి 6న సినిమాని రిలీజ్ చేస్తున్నాం’’ అని తెలిపారు. 

దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. ‘‘ఒక విలేజ్‌లో జరిగే క‌థ‌ ఇది. ప్రతి సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తూనే.. ఏం జరుగుతోందో అనే ఉత్కంఠను క‌లిగిస్తుంది. పతాక సన్నివేశాల వరకూ అదే థ్రిల్ కొన‌సాగుతుంది. ట్విస్టులు థ్రిల్‌ కలిగిస్తాయి. స్క్రీన్‌‌ప్లే ప్రధానంగా తెరకెక్కించాం’’ అని అన్నారు.

Sponsored links

O Pitaa Katha Movie Release Date fixed:

O Pitaa Katha Movie Release on March 6th

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019