‘మాస్టర్‌’ లుక్‌ కాపీ పేస్ట్ చేసేశారుగా!

Tue 28th Jan 2020 05:31 PM
vijay master movie,master,master look,copy,raju gari gadhi-3  ‘మాస్టర్‌’ లుక్‌ కాపీ పేస్ట్ చేసేశారుగా!
Master Recent look Copied By Telugu Film! ‘మాస్టర్‌’ లుక్‌ కాపీ పేస్ట్ చేసేశారుగా!
Sponsored links

కోలీవుడ్‌లో టాప్ హీరోల్లో ఒకరైన విజయ్ సినిమా అంటే అభిమానులు ఏ రేంజ్‌లో ఎగబడతారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా ఏదైనా ప్రారంభం అయ్యిందంటే చాలు.. అది రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్‌ను షేక్ చేసే వరకూ ఆయన వీరాభిమానులు తమవంతుగా ప్రయత్నాలు చేస్తుంటారు. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్టర్’. ఈ సినిమాను లోకేష్‌ కనకరాజ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి ఒకట్రెండు లుక్స్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం రిపబ్లిక్ డే సందర్భంగా ఫైట్‌ సీన్‌ ఉండే ఓ మాస్ లుక్‌ను విడుదల చేసింది.

తాజా లుక్ అదిరింది మాత్రం సూపర్బ్.. అదిరిపోయింది.. కానీ.. దీన్ని కాస్త నిశితంగా పరిశీలిస్తే మాత్రం తెలుగులో ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన ‘రాజుగారి గది-03’ లుక్‌ను సేమ్ టూ సేమ్ కాపీ పేస్ట్ చేసేసినట్లుగా స్పష్టంగా అర్థమైపోతోంది. మాస్టర్ లుక్‌లో నువ్వా-నేనా అని విజయ్ సేతుపతి- విజయ్ లుక్‌.. ఇదిగో పక్కనుండే పిక్‌ను కాస్త పరిశీలించండి అసలు విషయమేంటో మీకే కళ్లకు కట్టినట్లుగా తెలిసిపోతుంది. ఈ రెండు పిక్‌లను పక్క పక్కనెట్టి చూసిన నెటిజన్లు, మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు నవ్వుకుంటున్నారు. మరీ మన సినిమాలను కోలీవుడ్‌ డైరెక్టర్స్ ఈ రేంజ్‌‌లో కాపీ కొట్టేస్తున్నారేంటని నవ్వేసికుంటున్నారు. ఈ కాపీ పేస్ట్ వ్యవహారంపై డైరెక్టర్ లేదా హీరో రియాక్టయ్యి ఎలాంటి వివరణ ఇస్తారో.. లేదా నవ్వుకుంటున్నారుగా అని లైట్ తీసుకుంటారో మరి.

Sponsored links

Master Recent look Copied By Telugu Film!:

Master Recent look Copied By Telugu Film!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019