బన్నీ-సుక్కు చిత్రానికి టైటిల్ ఖరారవ్వలేదు

Title for AA 20 - Sukumar movie not yet finalized

Mon 20th Jan 2020 06:23 PM
Advertisement
aa 20,allu arjun,sukumar,title,rumours,aa 20 title  బన్నీ-సుక్కు చిత్రానికి టైటిల్ ఖరారవ్వలేదు
Title for AA 20 - Sukumar movie not yet finalized బన్నీ-సుక్కు చిత్రానికి టైటిల్ ఖరారవ్వలేదు
Advertisement

అల్లు అర్జున్ మరియు సుకుమార్ చిత్రానికి టైటిల్ ఖరారు అవ్వలేదు: చిత్రయూనిట్

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్వకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ చిత్రానికి సంబంధించి ఒక టైటిల్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ చిత్ర యూనిట్ ఈ మూవీకి ఎటువంటి టైటిల్ ఖరారు చెయ్యలేదు. కొన్ని వెబ్ సైట్స్‌లో ఈ మూవీకి టైటిల్ ఇదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. టైటిల్ ఖరారు అవ్వగానే చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారని చిత్ర పీఆర్ టీమ్ తెలిపింది. అల్లు అర్జున్‌కి ఇది 20వ సినిమా అవ్వడం విశేషం. సుకుమార్‌తో బన్నీ చేస్తున్న మూడో సినిమా ఇది.

అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునేలా సుకుమార్ ఈ చిత్ర స్ర్కిఫ్ట్ రెడీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. టైటిల్ విషయంలో చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది కాబట్టి.. ఇకపై టైటిల్‌పై వస్తున్న వార్తలకు చెక్ పడినట్లే. మరి ఈ చిత్రానికి ఎటువంటి టైటిల్ పెట్టనున్నారో వెయిట్ అండ్ సీ.

Advertisement

Title for AA 20 - Sukumar movie not yet finalized:

Clarity on Allu Arjun and Sukumar Film Title

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement