డిసెంబ‌ర్ 21న య‌ష్‌ ‘కెజియ‌ఫ్’ చాప్టర్2 ఫ‌స్ట్ లుక్

KGF Chapter 2 First Look Details

Sat 14th Dec 2019 11:19 PM
kgf chapter 2,kfg-2,kgf chapter 2 first look details  డిసెంబ‌ర్ 21న య‌ష్‌ ‘కెజియ‌ఫ్’ చాప్టర్2 ఫ‌స్ట్ లుక్
KGF Chapter 2 First Look Details డిసెంబ‌ర్ 21న య‌ష్‌ ‘కెజియ‌ఫ్’ చాప్టర్2 ఫ‌స్ట్ లుక్
Advertisement

రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా.. కైకాల స‌త్యనారాయ‌ణ స‌మ‌ర్పణ‌లో హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ప్రశాంత్ నీల్ ద‌ర్శక‌త్వంలో విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘కె.జి.య‌ఫ్‌’-చాప్టర్ 2. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తోంది. క‌న్నడ చ‌ల‌న చిత్ర చ‌రిత్రలోనే భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన ‘కె.జి.య‌ఫ్’ రెండు భాగాలుగా రూపొందింది. ‘కె.జి.య‌ఫ్’ చాప్టర్ 1ను పాన్‌ ఇండియా చిత్రంగా క‌న్నడ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేశారు. ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ హిట్ మూవీగా నిలిచింది. దీంతో ‘కె.జి.య‌ఫ్’- చాప్టర్ 2పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోన్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను డిసెంబ‌ర్ 21 సాయంత్రం 5:45గంట‌ల‌కు విడుద‌ల చేయనున్నట్లు చిత్రబృందం ఓ ప్రకటనలో తెలిపింది. 2020లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్రలో న‌టిస్తున్నారు. చాప్టర్- 1 సాధించిన విజ‌యంతో పెరిగిన అంచ‌నాల‌కు ధీటుగా ద‌ర్శక నిర్మాత‌లు ‘కె.జి.య‌ఫ్’ చాప్టర్ 2ను అన్ కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. రాకీ భాయ్‌గా రాకింగ్ పెర్ఫామెన్స్‌తో య‌ష్ ప్రేక్షకుల‌ను మెస్మరైజ్ చేయ‌నున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

KGF Chapter 2 First Look Details:

KGF Chapter 2 First Look Details


Loading..
Loading..
Loading..
advertisement