‘అర్జున్ సురవరం’ను పరుగులు పెట్టిస్తున్నాడు

Mon 09th Dec 2019 09:09 PM
hero nikhil,arjun suravaram,enters,second week  ‘అర్జున్ సురవరం’ను పరుగులు పెట్టిస్తున్నాడు
Arjun Suravaram Enters Second Week ‘అర్జున్ సురవరం’ను పరుగులు పెట్టిస్తున్నాడు
Sponsored links

రెండోవారంలో కూడా కొనసావుతున్న అర్జున్ సురవరం హవా, నిఖిల్ ప్రమోషన్స్ యాక్టివిటీస్‌కు ఫిదా..

యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం. నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిఖిల్, లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో జంటగా నటించారు. నిఖిల్ తన కెరీర్‌లో విభిన్న కథలకు ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. అర్జున్ సురవరం చిత్రం జర్నలిస్ట్ ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్‌గా సాగుతుంది. సురవరంపై కొంత బజ్ ఏర్పడింది. చిత్రం విడుదల తరువాత తొలి షో నుంచే ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ మొదలయింది. దర్శకుడు సంతోష్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఫలితంగా అర్జున్ సురవరం చిత్రం ఊహించినదానికంటే ఎక్కువగానే వసూళ్లు రాబడుతోంది. 

రెండో వారంలో కూడా సినిమా స్ట్రాంగ్‌గా నిలబడింది. ఈ సీజన్‌లో విడుదలైన చిత్రాల్లో అర్జున్ సురవరం టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇటీవల ఈ చిత్రం నిర్వహించిన సక్సెస్ టూర్‌కు అనూహ్య స్పందన లభించింది. సెకండ్ వీక్‌లో కూడా సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుండడంతో థియేటర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. నిఖిల్ సినిమా ప్రమోషన్‌ను తన భుజాలపైన వేసుకొని ప్రమోట్ చేస్తున్నాడు. కొన్ని రోజులుగా అతను సినిమా కోసం చేస్తున్న యాక్టివిటీస్‌కు అంతా ఫిదా అవుతున్నారు.

Sponsored links

Arjun Suravaram Enters Second Week:

Arjun Suravaram Promotions in Peak Stage

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019