సాయి రామ్‌శంకర్ ‘రీ సౌండ్’ మూవీ ఓపెనింగ్

Sun 01st Dec 2019 10:03 PM
sai ram shankar,sairam new movie,resound  సాయి రామ్‌శంకర్ ‘రీ సౌండ్’ మూవీ ఓపెనింగ్
Sai Ram Shankar Movie Resound Movie Opening సాయి రామ్‌శంకర్ ‘రీ సౌండ్’ మూవీ ఓపెనింగ్
Sponsored links

రియల్ రీల్స్ ఆర్ట్స్, అమృత హరిణి క్రియేషన్స్, శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్  పతాకం పై దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా రాశి సింగ్ హీరోయిన్‌గా కృష్ణ చిరుమామిళ్ల దర్శకతంలో జె సురేష్ రెడ్డి, రాజు, ఎన్‌విఎన్ రాజా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రీ సౌండ్’. శ్రీ వెంకటేశ్వర స్వామి అశీస్సులతో పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిధులు, స్టార్ చిరంజీవితో ‘సైరా’ సినిమాతో విజయ కెరటం ఎగరవేసిన దర్శకుడు సురేంద్ర రెడ్డి కెమెరా స్విచ్  ఆన్ చేసారు. డైరెక్టర్ సుకుమార్ క్లాప్ ఇవ్వగా.. మొదటి షాట్‌కు పోసాని కృష్ణ మురళి దర్శకత్వం వహించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌తో యూత్‌ని అలరిస్తున్న ఆకాష్ పూరి కూడా పూజ కార్యక్రమాల్లో పాల్గున్నారు.

అనంతరం పాత్రికేయుల సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్సకుడు సుకుమార్ మాట్లాడుతూ.. ‘సాయిరామ్ శంకర్ మళ్ళీ ‘రీసౌండ్’ పేరుతో వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ.. ‘ఆర్యతో దర్శకుడు సుకుమార్ మంచి హిట్ సౌండ్ చేశారు.. ఇప్పుడు ‘రంగస్థలం’ తో రీసౌండ్ చేసాడు, ‘అతడొక్కడే’ తో దర్శకుడు సురేంద్ర రెడ్డి హిట్ సౌండ్ చేసారు.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా’ సినిమాతో ‘రీసౌండ్’ చేసాడు. మా సినిమా పేరు ‘రీసౌండ్’, మంచి కథ, కొత్తగా ఉంటుంది. రేపటి నుంచే షూటింగ్ ప్రారంభం. హైదరాబాద్, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నాం. అని కమర్షియల్ ఎలెమెంట్స్ ఉంటాయి. అందరిని అలరిస్తుంది. మా సినిమా ప్రారంభానికి వచ్చిన సుకుమార్ గారికి సురేంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు’ అని సాయిరామ్ తెలిపారు.

హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ.. ‘నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సాయి రామ్ శంకర్ గారికి, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్‌కి చాలా థాంక్స్’ అని తెలిపారు.

డైరెక్టర్ కృష్ణ చిరుమామిళ్ల మాట్లాడుతూ.. ‘మంచి కమర్షియల్ సినిమా. అందరికి సినిమా నచ్చుతుంది. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం’ అని తెలిపారు.

నిర్మాతలు రాజా రెడ్డి మాట్లాడుతూ.. ‘రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మంచి కమర్షియల్ సినిమా అవుతుంది. సాయిరామ్ శంకర్ కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుంది. సుకుమార్ గారికి, సురేంద్ర రెడ్డి గారికి మా సినిమా ఫంక్షన్‌కి వచ్చినందుకు ధన్యవాదాలు. మంచి కథ ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుంది’ అని తెలిపారు.

సినిమా పేరు : రీసౌండ్

నటి నటులు : సాయి రామ్ శంకర్, రాశి సింగ్, అరవింద కృష్ణ, తదితరులు

కెమెరా మాన్ : సాయి ప్రకాష్

సంగీతం : స్వీకర్ అగస్తి

డైరెక్టర్ : కృష్ణ చిరుమామిళ్ల

నిర్మాతలు :  జె సురేష్ రెడ్డి, రాజు, ఎన్ వి ఎన్ రాజా రెడ్డి.

Sponsored links

Sai Ram Shankar Movie Resound Movie Opening:

Sai Ram Shankar Movie Resound Movie Opening

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019