చైతూని కాదు.. దర్శకుడిని చూసి పెడుతున్నారు!

Sun 01st Dec 2019 09:13 PM
akkineni naga chaitanya,remunaration,sekhar kammula,love story  చైతూని కాదు.. దర్శకుడిని చూసి పెడుతున్నారు!
News About Akkineni Naga Chaitanya చైతూని కాదు.. దర్శకుడిని చూసి పెడుతున్నారు!
Sponsored links

నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాతో అటు వెంకటేష్‌తో కలిసి బాబీ డైరెక్షన్‌లో వెంకిమామ చేస్తున్నాడు. వెంకిమామ ఈ నెలాఖరున విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నప్పటికీ... శేఖర్ కమ్ముల చిత్రం మాత్రం వచ్చే ఏడాది ఉగాదికి విడుదల అంటున్నారు. ఇక ఈ రెండు చిత్రాలు గాక నాగ చైతన్య 14 రీల్స్ ప్రొడక్షన్ లో పరశురామ్‌తో సినిమాకి కమిట్ అయ్యాడనే న్యూస్ ఉంది. గీత గోవిందం తర్వాత పరశురామ్‌కి స్టార్ హీరోలెవరు పడకపోయినా.. చివరికి నాగ చైతన్యని లైన్‌లో పెట్టాడు. చైతుతో పరశురామ్ సినిమా ఫిక్స్.

అయితే ఈ సినిమాకి 14 రీల్స్ వారు భారీగా పెట్టుబడి పెడుతున్నట్లుగా టాక్. చైతుకి జోడిగా రష్మికని హీరోయిన్‌గా తీసుకుంటున్నారని వినికిడి. మరి ప్రస్తుతం క్రేజ్ ఉన్న రష్మికకి గట్టిగానే సమర్పించాలి. మరోపక్క బ్లాక్ బస్టర్ హిట్‌తో ఉన్న పరశురామ్‌కే 8 కోట్ల పారితోషకంతో పాటుగా.. లాభాల్లో వాటాకి 14 రీల్స్ సంస్థ సై అంటుంది. ఇక చైతుకి 6 కోట్లు. మిగతా నటీనటులకు, టెక్నీకల్ డిపార్ట్మెంట్‌కి మరో ఐదు కోట్లు, ఇంకా సినిమాకి 30 నుండి 35 కోట్లు పెడుతున్నట్టుగా ఫిలింనగర్ టాక్. మరి చైతూని చూసి అయితే 14 రీల్స్ అంత భారీ బడ్జెట్ అయితే పెట్టరు. ఎందుకంటే చైతూ ‘సవ్యసాచి’, ‘శైలజరెడ్డి’కి ఎక్కువ పెట్టుబడి పెట్టారు. కానీ నిర్మాతలకు చేతులు కాలాయి. అయితే చైతుని చూసి కాదు గాని పరశురామ్ టాలెంట్ చూసి అంతగా బడ్జెట్‌ని 14 రీల్స్ పెడుతున్నట్టుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినబడుతున్నాయి.

Sponsored links

News About Akkineni Naga Chaitanya:

News About Akkineni Naga Chaitanya  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019