కిక్కెంచే కియారా.. వాహ్ వా అనాల్సిందే!!

Sun 01st Dec 2019 06:51 PM
actress kiara advani,kiiyara,tollwood  కిక్కెంచే కియారా.. వాహ్ వా అనాల్సిందే!!
News About Actress Kiara Advani కిక్కెంచే కియారా.. వాహ్ వా అనాల్సిందే!!
Sponsored links

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు లేకుంటేనేమి... బాలీవుడ్ లో మాత్రం కియారా అద్వానీ రెడ్ కార్పెట్ మీద నడుస్తుంది. బాలీవుడ్ లో భీభత్సమైన ఫాలోయింగ్ తో ఉన్న కియారా అద్వానీకి బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఊపిరాడనివ్వడం లేదు. లాస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ సంగతెలా ఉన్న కబీర్ సింగ్ కియారా కెరీర్ ని ఒక్కసారిగా ఓ రేంజ్ కి తీసుకొచ్చింది. కబీర్ సింగ్ తర్వాత నాలుగైదు సినిమాల్తో కియారా కెరీర్ పరుగులు పెడుతుంది. సౌత్ లో అవకాశం వచ్చినా డేట్స్ సర్దుబాటు చెయ్యలేని పరిస్థితిలో కియారా అద్వానీ ఉంది అంటే... అమ్మడు జోరు బాలీవుడ్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధమవుతుంది. తాజాగా కియారా గుడ్ న్యూజ్ సినిమా ప్రమోషన్స్ లో బాగా బిజీగా వుంది. కరీనా కపూర్, అక్షయ్ కుమార్ లు కలిసి నటించిన గుడ్ న్యూజ్ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. గుడ్ న్యూజ్ ట్రైలర్ సినిమా పై క్రేజ్ పెంచేసింది.

ప్రస్తుతం ప్రమోషన్స్ కోసం కియారా రకరకాల డిజైనర్ డ్రెస్సుల్తో ఓ ఊపు ఊపుతుంది. కత్తిలాంటి మిడ్డీస్ తో కియారా కాక్ రేపుతోంది. ప్రస్తుతం గ్రీన్ డ్రెస్ లో కియారా అందాలు చూసి వాహ్ వాహ్ వా అనాలనిపిస్తుంది. ఆలావుంది కియారా ఆ డ్రెస్ లో. అందుకే కిక్కేంచే ఫోజులో కియారా అందాలు అంటూ క్యాప్షన్ పెట్టేసి మరీ కియారా అద్వానీ ఫోటోని వైరల్ చేస్తున్నారు. షిమ్మర్ అండ్ షైన్ అంటూ సోషల్ మీడియాలో కియారా ఫొటోస్ వైరల్ అయ్యాయి. మరి మీరు కియారా గ్రీన్ డ్రెస్ అందాలని తనివితీరా చూసి ఎంజాయ్ చెయ్యండి. 

 

 

 

 

 

 

 

Sponsored links

News About Actress Kiara Advani:

News About Actress Kiara Advani  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019