తమన్నా ఐటెం సాంగ్‌కు కాదా.. అతిథిగానా?

Sun 01st Dec 2019 09:17 PM
tamannah,item song,guest,sarileru neekevvaru  తమన్నా ఐటెం సాంగ్‌కు కాదా.. అతిథిగానా?
News About Tamannah.. Item Song Or Guest తమన్నా ఐటెం సాంగ్‌కు కాదా.. అతిథిగానా?
Sponsored links

మహేష్, తమన్నా కలిసి ‘ఆగడు’ సినిమాలో నటించారు. అయితే దర్శకుడు అనిల్ రావిపూడికి మాత్రం తమన్నా హిట్ హీరోయిన్. ‘ఎఫ్-2’లో వెంకీ సరసన తమన్నా నటించడడం, ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. మహేష్-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ కోసం అడగడం తమన్నా ఒప్పేసుకోవడం జరిగిపోయింది. తమన్నా కూడా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించబోతున్నట్లుగా కన్ఫర్మ్ చేసింది. ఇక తాజాగా మండే మండే ‘సరిలేరు నీకెవ్వరు’ సాంగ్స్ సందడి చేస్తాయని చెప్పడంతో.. అందులో తమన్నా- మహేష్‌ల ఐటెం సాంగ్ కూడా ఉంటుందని.. ఐటెం స్పెషలిస్ట్ దేవిశ్రీ ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడో అనే ఇంట్రెస్ట్ మహేష్ ఫాన్స్ లో పెరిగింది.

తాజాగా.. తమన్నా ఐటెం సాంగ్ సంగతేమో గని.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఓ అతిధి పాత్ర వెయ్యబోతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. మరి తమన్నా లక్కీ గనక తన సినిమాలో ఓ పాత్ర చేస్తే అది వర్కౌట్ అవుతుందని అనిల్ రావిపూడి భావించి తమన్నాకి గెస్ట్ రోల్ ఇచ్చినట్లుగా  ప్రచారం మొదలైంది. మరి ఐటెంలో తమన్నా ఉందా? లేదా? అనేది ప్రస్తుతం కాస్త కన్ఫ్యూషన్ అయినా... తమన్నా మాత్రం ‘సరిలేరు నీకెవ్వరు’లో ఉన్నది మాత్రం నిజమని, త్వరలోనే మహేష్ సినిమా కోసం తమన్నా సరిలేరు సెట్స్‌కి రాబోతుందని చెబుతున్నారు.

Sponsored links

News About Tamannah.. Item Song Or Guest:

News About Tamannah.. Item Song Or Guest  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019