అల్లు అరవింద్..ప్లాప్ డైరెక్టర్.. మధ్యలో మెగా హీరో!

Producer Allu aravind bumper Offer To Flop Director.. Details Here

Sun 01st Dec 2019 06:28 PM
Advertisement
producer allu aravind,bumper offer,flop director,vakkantham vamsi,sai dharam tej  అల్లు అరవింద్..ప్లాప్ డైరెక్టర్.. మధ్యలో మెగా హీరో!
Producer Allu aravind bumper Offer To Flop Director.. Details Here అల్లు అరవింద్..ప్లాప్ డైరెక్టర్.. మధ్యలో మెగా హీరో!
Advertisement

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కుర్ర హీరో సాయి ధరమ్‌ తేజ్‌. ఇప్పటికే పలు చిత్రాల్లో హీరోగా నటించిన ఆయన.. కొన్ని సూపర్ డూపర్‌ హిట్‌లు కాగా.. మరికొన్ని అట్టర్ ప్లాప్ అయ్యాయి. పెద్దగా ఒడిదుడుకులు ఏమీ లేనప్పటికీ తేజ్ సినీ కెరీర్ సాఫీగానే సాగుతోంది. త్వరలోనే కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా పేరుగాంచిన మారుతి తెరకెక్కించిన చిత్రంతో  ‘ప్రతి రోజు పండగే’ అంటూ మెగాభిమానుల ముందుకొస్తున్నాడు. డిసెంబర్ 20న థియేటర్లలో పండుగ చేసుకోనుంది. ఈ సినిమా అయినా హిట్ అవ్వకపోతుందా..? అని తేజ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వెలుగుచూసింది.

ఈ సినిమా తర్వాత మరో సూపర్ స్టోరీతో మెగాభిమానుల ముందుకు వస్తున్నాడట. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తాడని టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడికానున్నాయట. స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈయన ఫస్ట్ మూవీతో అట్టర్ ప్లాప్ ఖాతాలో వేసుకున్న వక్కంతం వంశీకి.. అల్లుఅరవింద్ బంపరాఫర్ ఇచ్చినట్లు గత రెండ్రోజులు వార్తలు గుప్పుమంటున్నాయ్. తన కుమారుడికి అట్టర్ ప్లాప్ సినిమా ఇచ్చినప్పటికీ ఆయన్ను ఆదరించాలని భావించిన అరవింద్.. యంగ్ హీరోకు కథ చెప్పాలని సూచించాడట. అది కూడా భారీ బడ్జెట్ కాకుండా మీడియంలోనే వెళ్లాలని వంశీకి ఆయన సూచించాడట. 

అయితే ఆ యంగ్ హీరో మరెవరో కాదు.. సాయిధరమ్ తేజ్ అని దీన్ని బట్టి తెలిసిపోయింది. అయితే అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది. కాగా.. అరవింద్ సూచనతో కథ రెడీ చేసే పనిలో వంశీ నిమగ్నమయ్యాడట. మరి అసలే వంశీపై ప్లాప్ డైరెక్టర్ అనే ముద్రపడింది.. మరోవైపు మెగా కుర్రాడు కూడా హిట్ కోసం చాలా రోజులుగా వేచి చూస్తున్నాడు.. మరి ఈ కాంబో ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో..? అసలు ఎంతవరకు సినిమా ముందుకెళ్తుందో..? ఇది పుకారుగానే మిగిపోతుందా..? లేదా నిజమా..? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

Advertisement

Producer Allu aravind bumper Offer To Flop Director.. Details Here :

Producer Allu aravind bumper Offer To Flop Director.. Details Here   

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement