‘దర్బార్’ ఫస్ట్ సింగిల్.. పక్కా మాసమ్మా..!

Thu 28th Nov 2019 01:37 PM
darbar,darbar first single,dhummu dholi lyrical video,rajinikanth,sp balu,ar murugadoss,anirudh  ‘దర్బార్’ ఫస్ట్ సింగిల్.. పక్కా మాసమ్మా..!
Darbar Movie First Single Released ‘దర్బార్’ ఫస్ట్ సింగిల్.. పక్కా మాసమ్మా..!
Sponsored links

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘దర్బార్’ చిత్రంలోని ‘నేనేరా ఇక మీద ఉన్న చోటే దర్బారు’ ఫస్ట్ సింగిల్ విడుదల!!

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం ‘దర్బార్’.  లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వ్యాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  రజిని ఒక ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా  నటిస్తున్న‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ‘దర్బార్’ మోషన్ పోస్టర్ కి ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. లేటెస్ట్ గా ‘దర్బార్’ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

దుమ్ము- ధూళి...నేనేరా ఇక మీద ఉన్న చోటే దర్బారు.. ఉన్నా నీ గ్యాంగు నేనేరా లీడు.... అంటూ రజినీకాంత్ ‘దర్బార్’ ఎలా రౌడీల అంతు చూడబోతున్నారు అనే విషయాన్ని తెలిపే విధంగా సాగే ఈ మాస్ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా  గానగంధర్వుడు ఎస్.పి బాలసుబ్రమణ్యం తనదైన శైలిలో ఆలపించారు. రజిని మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని చేసిన ఈ పాట ఆయ‌న స్టైల్ కు తగ్గట్టుగా ఫాస్ట్ బీట్లో ఉండేలా లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్ ర‌విచంద్ర‌న్ స్వరపరిచారు. ఈ పాటతో అనిరుద్ మరోసారి తన మాస్ అప్పీల్‌ను చూపించాడు. ‘దర్బార్’ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సాంగ్ పక్కా మాస్ సాంగ్ కావడంతో రజిని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: స‌ంతోష్ శివ‌న్‌, మ్యూజిక్: అనిరుద్ ర‌వి చంద్ర‌న్, ఎడిట‌ర్: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్, నిర్మాత: ఎ.సుభాస్కరన్, ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్. మురుగదాస్‌.

Click Here for Song

Sponsored links

Darbar Movie First Single Released:

First Single ‘Nenera Ika Meeda Unna Chote Darbaaru...’ From Superstar Rajinikanth’s Darbar Is Out

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019