సురేష్, నాని ఇళ్లపై ఐటీ రైడ్స్.. శ్రీరెడ్డి రియాక్షన్ ఇదీ

Fri 22nd Nov 2019 07:23 PM
controversy queen,sree reddy,suresh babu,natural star nani,it rides  సురేష్, నాని ఇళ్లపై ఐటీ రైడ్స్.. శ్రీరెడ్డి రియాక్షన్ ఇదీ
Controversy Queen Sree Reddy Reacts On Tollywood IT Rides సురేష్, నాని ఇళ్లపై ఐటీ రైడ్స్.. శ్రీరెడ్డి రియాక్షన్ ఇదీ
Sponsored links

టాలీవుడ్‌‌‌‌‌ ప్రముఖలపై ఐటీ కన్నేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఏకకాలంలో ప్రముఖల ఇళ్లపై ఈ రేంజ్‌లో ఐటీ అధికారులు దాడులు చేసిన దాఖలాల్లేవ్. బుధవారం ఫస్ట్ టైం.. పలు ప్రముఖ స్టూడియోలు, ప్రొడక్షన్ హౌస్‌లు, ప్రముఖ హీరోలు, నిర్మాతలకు ఐటీ అధికారులు ఊహించని షాకిచ్చారు. అయితే ఎవరెవరి ఇళ్లపై ఐటీ అధికారులు మెరుపుదాడులు చేశారనే విషయం పూర్తిగా తెలియరాలేదు కానీ.. రామానాయుడు స్టూడియో, సురేష్ ప్రొడక్షన్ హౌస్‌తో పాటు విక్టరీ వెంకటేష్, నేచురల్ స్టార్ నానీల ఇళ్లపై ఐటీ దాడులు జరిగినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ ఐటీ దాడులతో టాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఇప్పటికీ ఈ ఐటీ దాడులను ఆయా ప్రముఖులు రహస్యంగానే ఉంచారు. మరోవైపు సోదాల్లో ఏమేం దొరికాయ్..? అనే విషయాలను ఐటీ అధికారులు సైతం బయటికి పొక్కనివ్వట్లేదు.

ఈ క్రమంలో ఇదే అదునుగా చేసుకున్న టాలీవుడ్ వివాదాస్పద నటి, కాంట్రవర్సీ క్వీన్ బిరుదు పొందిన శ్రీరెడ్డి.. ఫేస్‌బుక్ వేదికగా స్పందించింది. అటు రామానాయుడు స్టూడియో, సురేష్ ప్రొడక్షన్స్‌పై, నానిల ఇళ్లపై జరిగిన దాడులపై రియాక్ట్ అయిన తీరును చూసిన జనాలు నోరెళ్లబెట్టారు. ‘ఐటి దాడులను నేను సమర్థిస్తున్నాను. ముఖ్యంగా తను ఎప్పట్నుంచో టార్గెట్ చేస్తున్న వాళ్లపైనే ఇప్పుడు ఐటి దాడులు జరగడంతో ఎగిరి గంతేయాలని అనిపిస్తోంది. దేవుడు ఉన్నాడు.. సురేష్ బాబు గారూ. మోదీజీ, ఇన్ కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు థ్యాంక్స్’ అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చింది.

కాగా.. సురేష్ బాబు తనయుడు అభిరామ్‌, నేచురల్ స్టార్ నానిపై కాంట్రవర్సీ క్వీన్ లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఫొటోలుతో సహా బయటపెట్టి అప్పట్లో పెద్ద హడావుడి చేసిన విషయం అందరికీ గుర్తండే ఉంటుంది. సో.. ఇప్పుడు వారిపై ఐటి దాడులు జరగడంతో ఈ విధంగా శ్రీరెడ్డి పైశాచిక ఆనందం పొందుతోంది. అయితే ఐటి దాడులు అనేవి సర్వసాధారణమే అనే విషయం కాంట్రవర్సీ ఎరుగదేమో మరి.

Sponsored links

Controversy Queen Sree Reddy Reacts On Tollywood IT Rides :

Controversy Queen Sree Reddy Reacts On Tollywood IT Rides   

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019