నా మీద ఐటీ దాడులు చేసుంటే..: నవదీప్

Fri 22nd Nov 2019 06:15 PM
tollywood,navadeep,it rides,income tax department  నా మీద ఐటీ దాడులు చేసుంటే..: నవదీప్
Tollywood Hero Navadeep Reacts On IT Rides నా మీద ఐటీ దాడులు చేసుంటే..: నవదీప్
Sponsored links

టాలీవుడ్‌‌‌‌‌ ప్రముఖలపై ‘ఐ’టీ కన్నేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఫస్ట్ టైం.. పలు ప్రముఖ స్టూడియోలు, ప్రొడక్షన్ హౌస్‌లు, ప్రముఖ హీరోలు, నిర్మాతలకు ఐటీ అధికారులు ఊహించని షాకిచ్చారు. అయితే ఎవరెవరి ఇళ్లపై ఐటీ అధికారులు మెరుపుదాడులు చేశారనే విషయం పూర్తిగా తెలియరాలేదు కానీ.. రామానాయుడు స్టూడియో, సురేష్ ప్రొడక్షన్ హౌస్‌తో పాటు ఇద్దరు హీరోల పేర్లు మాత్రం పెద్దఎత్తున వినిపించాయి. ఈ ఐటీ దాడులతో టాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. 

ఇదిలా ఉంటే.. యంగ్ హీరో, హైదరాబాద్‌లో పలు పబ్‌లు నడుపుతున్న నవదీప్‌ ఇంటిపై కూడా సోదాలు జరిగినట్లు ఆలస్యం వెలుగులోకి చూసింది. అయితే ఇదంతా అబద్ధమేనని అసలేం జరిగిందో కూడా ఆయన ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చుకున్నాడు. ‘ఒకవేళ ఐటీ అధికారులు నా మీద దాడులు చేసి ఉంటే కొంత డబ్బును వారే నా వద్ద వదిలేసి వెళ్లేవారు’ అని నవదీప్ ఫన్నీగా కామెంట్ చేశాడు. అంతటితో ఆగని ఆయన.. ‘బిల్ బ్యాండ్ బాజా’ అనే ట్యాగ్‌తో ట్విస్ట్ ఇచ్చాడు. ఈయన ట్వీట్‌కు పలువురు అభిమానులు, నెటిజన్లు చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Sponsored links

Tollywood Hero Navadeep Reacts On IT Rides:

Tollywood Hero Navadeep Reacts On IT Rides  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019