NC19 నుంచి చైతూ లుక్ విడుదల

NC19 Movie Naga Chaitanya Look Released

Fri 22nd Nov 2019 06:11 PM
naga chaitanya,nc19,movie,look,released  NC19 నుంచి చైతూ లుక్ విడుదల
NC19 Movie Naga Chaitanya Look Released NC19 నుంచి చైతూ లుక్ విడుదల
Advertisement

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమా నుండి హీరో చైతు లుక్ విడుదలైంది. ఈ పోస్టర్ లో సూపర్ కూల్ లుక్ లో నాగ చైతన్య ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. చైతు బర్త్ డే సందర్భంగా నవంబర్  23న ఉదయం 10.30 నిమిషాలకు హీరో క్యారెక్టర్ ని పరిచయం చేసే ఓ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. సహజత్వం నింపుకొన్న పాత్రలతో అందమైన కథలను తెర మీదకు తెచ్చే శేఖర్ కమ్ముల ఈ ప్రేమకథను మరింత హృద్యంగా మలుచుతున్నాడు. నాగ చైతన్య లుక్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు డైరెక్టర్. తన ప్రపంచంలోకి ఆయన బర్త్ డే సందర్భంగా మనల్ని అహ్వానిస్తున్నాడు చైతు. అక్కినేని అభిమానులకు, సినిమా అభిమానులకు కొత్త  ఎక్స్ పీరియన్స్ గా ఉండబోతుంది ఆ వీడియో.

ఏమిగోస్  క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నాగచైతన్య సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

టెక్నికల్ టీమ్ :

ఆర్ట్ : రాజీవ్ నాయర్

కెమెరా : విజయ్ సి కుమార్

మ్యూజిక్ : పవన్

సహా నిర్మాత: విజయ్ భాస్కర్

పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియా

నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు

రచన-దర్శకత్వం : శేఖర్ కమ్ముల.

NC19 Movie Naga Chaitanya Look Released:

Naga Chaitanya Look Released from NC19


Loading..
Loading..
Loading..
advertisement