‘దొంగ’తో మరో బ్లాక్‌బస్టర్: కింగ్ నాగార్జున

King Nagarjuna Launches Karthi Donga Movie Teaser

Sat 16th Nov 2019 10:09 PM
Advertisement
karthi,donga,teaser released,nagarjuna,karthi movie,khaidi,donga teaser review  ‘దొంగ’తో మరో బ్లాక్‌బస్టర్: కింగ్ నాగార్జున
King Nagarjuna Launches Karthi Donga Movie Teaser ‘దొంగ’తో మరో బ్లాక్‌బస్టర్: కింగ్ నాగార్జున
Advertisement

‘దొంగ’ చిత్రంతో కార్తీకి మరో బ్లాక్‌బస్టర్‌ రాబోతోంది: కింగ్‌ నాగార్జున

యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘దొంగ’. ఈ చిత్రంలో హీరో కార్తీ వదిన, హీరో సూర్య సతీమణి జ్యోతిక ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. కాగా, ఈ చిత్రం టీజర్‌ను కింగ్‌ నాగార్జున విడుదల చేశారు. కింగ్‌ నాగార్జున, కార్తీ కలిసి ‘ఊపిరి’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు కార్తీ లేటెస్ట్‌ మూవీ ‘దొంగ’ టీజర్‌ను రిలీజ్‌ చేసిన కింగ్‌ నాగార్జున ‘మరో బ్లాక్‌బస్టర్‌ రాబోతోంది’ అంటూ టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌ తెలిపారు. తమిళ్‌ టీజర్‌ను హీరో మోహన్‌లాల్‌, హీరో సూర్య విడుదల చేశారు.

ఈ సినిమాలో కార్తీ క్యారెక్టరైజేషన్‌ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందని టీజర్‌ ప్రారంభంలోనే చెప్పడం జరిగింది. రకరకాల పేర్లతో చలామణి అయ్యే దొంగగా పోలీసుల దృష్టిలో కనిపిస్తాడు కార్తీ. ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే యాక్షన్‌ సీక్వెన్సులు ఉంటూనే అక్క, తమ్ముడు మధ్య కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌, సెంటిమెంట్‌ సీన్స్‌ కూడా కనిపిస్తాయి. ఈ టీజర్‌ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది. దానికి తగ్గట్టుగానే గోవింద్‌ వసంత బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.

ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘ఖైదీ’ తర్వాత యాంగ్రీ హీరో కార్తీ చేసిన ‘దొంగ’ ఫస్ట్‌లుక్‌తోనూ, టీజర్‌తోనూ ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను సూర్య రిలీజ్‌ చేయగా, టీజర్‌ను కింగ్‌ నాగార్జున విడుదల చేసి బెస్ట్‌ విషెస్‌ చెప్పడం విశేషం. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

యాంగ్రీ హీరో కార్తీ, జ్యోతిక, సత్యరాజ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌, సంగీతం: గోవింద్‌ వసంత, నిర్మాతలు: వయాకామ్‌ 18 స్టూడియోస్‌, సూరజ్‌ సదానా, దర్శకత్వం: జీతు జోసెఫ్‌. 

Click Here for Teaser

Advertisement

King Nagarjuna Launches Karthi Donga Movie Teaser :

Karthi Donga Movie Teaser Released

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement