ఇక ఈ భామ ఆశలన్నీ ‘క్రాక్’ పైనే..!!

Sat 16th Nov 2019 09:46 PM
varalakshmi sarath kumar,tenali ramakrishna,raviteja,krack,hopes  ఇక ఈ భామ ఆశలన్నీ ‘క్రాక్’ పైనే..!!
Varalakshmi Sarath Kumar Disappointed with Tenali Ramakrishna Result ఇక ఈ భామ ఆశలన్నీ ‘క్రాక్’ పైనే..!!
Sponsored links

తమిళంలో శరత్ కుమార్ కూతురు, విశాల్ మాజీ గర్ల్ ఫ్రెండ్ వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్‌గా కెరీర్‌లో వెనకబడిపోయేసరికి విలన్ అవతారమెత్తింది. హీరోయిన్ లక్షణాలు ఏ కోశానా లేని వరలక్ష్మి శరత్ కుమార్‌కి విలన్ లక్షణాలు మాత్రం పుష్కలంగా వున్నాయి. ఆమె చూపు, ఆమె బాడీ తీరు, ఆమె పొగరు అన్ని విలన్ పాత్రలకి చాలా దగ్గరగా ఉండడంతో... గ్లామర్ హీరోయిన్ వేషాలకు బై బై చెప్పేసి స్టార్ హీరోల సినిమాలో విలన్‌గా సెటిలవుదామనుకుంటుంది. విశాల్ పందెంకోడి 2 సినిమాలో విలనిజాన్ని పండించింది. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. అయితే ఆ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ పాత్ర కూడా అంతగా ఎక్కలేదు.

ఇక విజయ్ లాంటి స్టార్ హీరో సర్కార్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్ర చేసింది. విజయ్ మీద పొలిటికల్ విలన్‌గా వరలక్ష్మి అదరగొట్టిందనే చెప్పాలి. ఆ పాత్ర బావుంది, వరలక్ష్మి విలన్ నటనకు మంచిమార్కులు పడ్డాయి. కానీ సినిమా యావరేజ్ అవడంతో.. పాపకి హిట్ పడలేదు. ఇక తాజాగా తెలుగులోనూ సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ బిఎబిల్ లోను వరలక్ష్మి ఓ పవర్ ఫుల్ రోల్ చేసింది. వరలక్ష్మీ దేవి పాత్రలో ఓ జర్నలిస్ట్ మర్డర్ కేసులో ఇరుకుంటుంది. అయితే వరలక్ష్మి తన పాత్ర పరిధిమేర చక్కగానే నటించింది. కానీ సినిమాకే ప్లాప్ టాక్ రావడంతో.. వరలక్ష్మి పాత్ర కూడా తేలిపోయింది. మరి ఇక్కడా వరలక్ష్మి కి వర్కౌట్ అవ్వలేదు. మరి రవితేజ -గోపీచంద్ మలినేని సినిమాలో ఛాన్స్ కొట్టేసిన వరలక్ష్మి ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే టాలీవుడ్‌లో బిజీ అవ్వాలనే ఆమె కోరికను తెనాలి రామకృష్ణ ఎలాగూ తీర్చలేదు.. అందుకే ‘క్రాక్’నే నమ్ముకుంది. మరి అదయినా నిలబెడుతుందో.. లేదంటే మళ్ళీ కోలీవుడ్‌కే చెక్కేసేలా చేస్తుందో చూడాలి. 

Sponsored links

Varalakshmi Sarath Kumar Disappointed with Tenali Ramakrishna Result:

Varalakshmi Sarath Kumar Hopes on Krack

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019