త్రివిక్రమ్ మళ్లీ మొదటికి వచ్చాడా..?

Heavy Budget to Bunny Ala Vaikunthapurramloo

Sat 16th Nov 2019 09:40 PM
Advertisement
ala vaikunthapurramloo,trivikram srinivas,budget,allu arjun,agnathavasi  త్రివిక్రమ్ మళ్లీ మొదటికి వచ్చాడా..?
Heavy Budget to Bunny Ala Vaikunthapurramloo త్రివిక్రమ్ మళ్లీ మొదటికి వచ్చాడా..?
Advertisement

త్రివిక్రమ్ కెరీర్‌లో పవన్ కళ్యాణ్‌తో తీసిన ‘అజ్ఞాతవాసి’ సినిమా అతి పెద్ద డిజాస్టర్. ఆ సినిమాకి త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్‌ని చూసి భారీ బడ్జెట్ పెట్టించేవాడు. కానీ ఆ సినిమా అనుకున్న ఫలితం రాకపోగా... నిర్మాతలకు భారీ షాకిచ్చింది. ఆ దెబ్బకి త్రివిక్రమ్ ఎన్టీఆర్ చెప్పింది చేసాడు. తనకు నచ్చని జోనర్‌లో ఎన్టీఆర్ చెప్పినట్లుగా అరవింద సమేత మాస్ చిత్రం తీసాడు. ఎన్టీఆర్ చెప్పాడని కాదుగాని... త్రివిక్రమ్ కూడా అజ్ఞాతవాసి దెబ్బకి అరవింద సమేతకి బడ్జెట్ కంట్రోల్ లో పెట్టాడు. ఇక అరవింద సమేత సినిమాకి హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ రాలేదు. అయినప్పటికీ నిర్మాతలకు నష్టాలైతే రాలేదు. కారణం బడ్జెట్ కంట్రోల్.

అయితే అజ్ఞాతవాసి దెబ్బకి అరవింద సమేతతో లైన్‌లోకొచ్చిన త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమాకి మాత్రం బడ్జెట్ కంట్రోల్ తప్పాడని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకి స్టార్ నటులను తీసుకోవడం, అలాగే సినిమా కోసం అందమైన భారీ సెట్స్ వేయించాడని అందుకే బడ్జెట్ కంట్రోల్‌లో లేకుండా ఎడా పెడా ఖర్చు అవుతుందని అంటున్నారు. ఇంకా ఎవరూ టచ్ చెయ్యని ఫారిన్ లొకేషన్స్‌లో షూట్ చేయడం వలన కూడా బడ్జెట్ పెరిగిందనే టాక్ వినబడుతుంది. ఇప్పటివరకు అల్లు అర్జున్ సినిమాలకు పెట్టని పెట్టుబడి ఈ చిత్రానికి అవుతుందని అంటున్నారు. మరి త్రివిక్రమ్ వలన అల్లు అర్జున్ కెరీర్‌లో ఈ అల వైకుంఠపురములో సినిమా భారీ బడ్జెట్ చిత్రం కాబోతుందన్నమాట. అయితే విడుదల రోజు హిట్ టాక్ పడితే మాత్రం.. పెట్టిన బడ్జెట్ తిరిగిరావడం పెద్ద సమస్యే కాదు కానీ.. ఏమైనా తేడా కొడితేనే కష్టం. చూద్దాం ఏం జరుగుతుందో..?

Advertisement

Heavy Budget to Bunny Ala Vaikunthapurramloo:

Trivikram Confident on Ala Vaikunthapurramloo Movie

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement