‘తెనాలి రామకృష్ణ’ని నమ్ముకున్నాడు.. కానీ..?

Sat 16th Nov 2019 09:30 PM
tenali ramakrishna babl,talk,sundeep kishan,hansika,box office report  ‘తెనాలి రామకృష్ణ’ని నమ్ముకున్నాడు.. కానీ..?
Tenali Ramakrishna BABL Talk at Box Office ‘తెనాలి రామకృష్ణ’ని నమ్ముకున్నాడు.. కానీ..?
Sponsored links

‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో మంచి సక్సెస్‌ అందుకున్న సందీప్‌ కిషన్‌, తాజాగా తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిను వీడని నీడను నేనే సినిమా ముందు వరస ప్లాప్స్ తో సందీప్ కిషన్ మార్కెట్ జీరో అయ్యింది. కథల ఎంపికలో పొరబాట్లు సందీప్ కిషన్‌ని కష్టాల్లోకి నెట్టాయి. తాజాగా విడుదలైన తెనాలి రామకృష్ణ కూడా సందీప్‌కి షాకిచ్చింది. తెనాలి రామకృష్ణ మొదటి షో నుంచే టాక్ అనుకున్నంతగా లేదు. సందీప్ కిషన్ తన శాయశక్తులా ఈ సినిమా ప్రమోషన్స్ చేసాడు. ప్రేక్షకుల్లోకి ఎంతగా తీసుకెళ్లినా.. తెనాలి రామకృష్ణకి చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ పడలేదు. ఇప్పుడొచ్చిన టాక్‌తో అనుకున్న కలెక్షన్స్ రావడం కూడా కష్టమే అంటున్నారు.

జి. నాగేశ్వర రెడ్డి కామెడీని నమ్ముకున్న సందీప్ కిషన్ ఘోరంగా దెబ్బతిన్నాడనే చెప్పాలి. అల్లరి నరేష్ చెయ్యాల్సిన కామెడీని సందీప్ కిషన్ చేస్తే.. ప్రేక్షకులకు ఎక్కుతుందా... ఎక్కదు. కాకపోతే చెట్టుకింద ప్లీడరు‌గా సందీప్ నటన బానే ఉంది. ఇక హీరోయిన్ హన్సిక ఈ సినిమాకి మెయిన్ మైనస్. ఆమె గ్లామర్ షోకి తప్ప దేనికి పనికిరాలేదు. హన్సిక మేకప్, ఆమె నవ్వు ప్రేక్షకులకు చిరాకు పెట్టించాయి. ఇక దర్శకుడు ఫస్ట్ హాఫ్‌ని కాస్త పర్వాలేదనేటట్టుగా తీసినా.. సెకండ్ హాఫ్ బోర్ కొట్టించాడు. ఏ మాత్రం కొత్తదనం లేని కామెడీ సన్నివేశాలతో బోర్‌ కొట్టించాడు. వరలక్ష్మీ వంటి ఇంటెన్స్‌ యాక్టర్స్‌ ఉన్నా వాళ్లను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదేమో అనిపిస్తుంది. ఇక సినిమా నిడివి తక్కువే అయినా కథనం ఆసక్తికరంగా లేకపోవటంతో భారంగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మరి చివరికి సందీప్ కిషన్‌ని ఈ తెనాలి రామకృష్ణ కూడా కాపాడలేకపోయాడనే చెప్పుకోవాలి.

Sponsored links

Tenali Ramakrishna BABL Talk at Box Office:

One More Average Movie on Sundeep Kishna Account

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019