ఇక్కడ యుద్ధం మహేష్, బన్నీలదే కాదు..!

Heroines fight for Tollywood Top Chair

Sun 17th Nov 2019 12:48 PM
Advertisement
sankranthi fight,pooja hegde,rashmika mandanna,allu arjun,mahesh babu,sarileru neekevvaru,ala vaikunthapurramloo  ఇక్కడ యుద్ధం మహేష్, బన్నీలదే కాదు..!
Heroines fight for Tollywood Top Chair ఇక్కడ యుద్ధం మహేష్, బన్నీలదే కాదు..!
Advertisement

ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ రేంజ్ హీరోయిన్స్‌లో ఇద్దరే ఇద్దరి పేర్లు వినబడుతున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోల చాయిస్ ఆ ఇద్దరి హీరోయిన్స్ కావడంతో.. అందరి చూపు ఆ హీరోయిన్స్ మీదే ఉంది. రెండు హిట్స్‌తో మహేష్, అల్లు అర్జున్ సరసన ఛాన్సులు పట్టేసిన రష్మిక మందన్న, హిట్స్ లేకపోయినా.. స్టార్ హీరోలతో దున్నేస్తున్న పూజా హెగ్డే. ఈ ఇద్దరు ప్రస్తుతం టాలీవుడ్‌లో పోటీ పడుతున్న హీరోయిన్స్. అటు రెమ్యునరేషన్ విషయంలోనూ, ఇటు సినిమాల విషయంలోనూ రష్మిక, పూజా ఎక్కడా తగ్గడం లేదు. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్న సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో.. ప్రస్తుతం టాప్‌లో ఉన్న ఈ ఇద్దరిలో ఎవరు హిట్ కొట్టి టాప్ లేపుతారో అంటూ అప్పుడే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.

అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఈ సినిమాలో బన్నీకి బాస్‌గా పూజా కాస్త కోపిష్టి పాత్రలో నటిస్తుందని టాక్. ఇక అల్లు అర్జున్‌తో పూజా కాంబో పిక్స్ కూడా చూడడానికి చాలా రొమాంటిక్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు విడుదలైన పాటల్లోనూ పూజా డాన్స్‌లు ఉంటాయని అభిమానులు ఆశ పడుతున్నారు. ఇక పూజా హెగ్డే - అల్లు అర్జున్ ఇద్దరు డీజే లో డాన్స్ షో చేసి ఆకట్టుకున్నారు. మరి ఈ సినిమాలో పూజా లుక్స్ దాదాపుగా రివీల్ అయ్యాయి. 

ఇక మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్న రష్మిక లుక్ చాలా సింపుల్‌గా ఉంది. ఇక మహేష్ సరసన రష్మిక ఎలా ఉంటుందో తెలుపడానికి సరైన లుక్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఇంకా మహేష్ - రష్మిక కాంబో లుక్ బయటికి రాలేదు. ఇక మహేష్‌కి పెద్దగా డాన్స్‌లు రావు. రష్మిక కూడా గొప్ప డాన్సర్ కాదు. మరి సంక్రాంతికి రిలీజ్ కాబోతోన్న అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు రెండూ రెండే అన్న రేంజ్లో క్రేజ్ కొట్టేశాయి. మరి ఈ సంక్రాంతికి మహేష్ - అల్లు అర్జున్‌ల మీద ఎంత క్రేజ్, ఎంత అంచనాలున్నాయో ఈ ఇద్దరు హీరోయిన్స్ పూజా - రష్మికలపై కూడా అలాగే ఉన్నాయి.

Advertisement

Heroines fight for Tollywood Top Chair:

Sankranthi Fight: Pooja Hegde vs Rashmika Mandanna

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement