మహేష్‌ని నమ్ముకుంటే.. నమ్రత వరమిచ్చింది!

Namratha Favour to Meher Ramesh

Thu 14th Nov 2019 07:35 PM
Advertisement
mahesh babu,sarileru neekevvaru,guntur,rights,meher ramesh,namratha  మహేష్‌ని నమ్ముకుంటే.. నమ్రత వరమిచ్చింది!
Namratha Favour to Meher Ramesh మహేష్‌ని నమ్ముకుంటే.. నమ్రత వరమిచ్చింది!
Advertisement

ప్లాప్ దర్శకుడు మెహర్ రమేష్ గత కొన్నాళ్లుగా మహేష్ కాంపౌండ్ లోనే ఉంటున్నాడు. మహేష్ భార్య నమ్రతని నమ్ముకుని మహేష్ ఫ్యామిలీతో పాటుగా తిరుపతి, ఇంకా చాలా చోట్లకి తిరగడమే గాకుండా మహేష్ సినిమా ఓపెనింగ్స్ అప్పుడు కూడా మెహర్ రమేష్ హడావిడి చేస్తున్నాడు. అయితే ఈ ప్లాప్ దర్శకుడు మహేష్ ఫ్యామిలీ తో బాగా క్లోజ్ అవడంతో.. చాలామంది ఈ ప్లాప్ దర్శకుడు ఇక్కడేం పని.. అసలు మహేష్ అవకాశం ఇస్తాడని ఈ కాంపౌండ్ పట్టుకుని తిరుగుతున్నాడా..  అంటూ చాలా రకాల కామెంట్స్ పడ్డాయి.

అయితే తాజాగా మహేష్ ని నమ్ముకుని అక్కడే ఉన్నందుకు మెహర్ రమేష్ కి ఓ ఫెవర్ జరిగినట్లుగా చెబుతున్నారు. మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ చివరి దశలోఉంది. సంక్రాంతికి రిలీజ్ అవడంతో.. సినిమా ప్రమోషన్స్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా బిజినెస్ కూడా అంచనాలకు మించి జరిగుతుంది. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా గుంటూరు హక్కులు మెహెర్ రమేష్ చేతికి వచ్చాయని.. మహేష్ ని నమ్ముకుని ఉన్నందుకు మెహర్ రమేష్ కి నమ్రత రికమండేషన్ మీద సరిలేరు గుంటూరు హక్కులు మెహర్ కి దక్కినట్టుగా ప్రచారం జరుగుతుంది. 

Advertisement

Namratha Favour to Meher Ramesh:

Sarileru Neekevvaru Guntur Rights to Meher Ramesh

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement