‘నేత్ర’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ చేసిన ‘మా’ నరేష్

Thu 17th Oct 2019 04:06 PM
maa president naresh,nethra movie first look,nethra  ‘నేత్ర’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ చేసిన ‘మా’ నరేష్
MAA Naresh Released ‘Nethra’ First Look ‘నేత్ర’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ చేసిన ‘మా’ నరేష్
Sponsored links

బివిఎస్ఆర్ క్రియేష‌న్స్, మీజా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేన‌ర్స్‌పై బి.వి సుబ్బారెడ్డి నిర్మాత‌గా హుస్సేన్(ఎ.ఎండి) ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న  సస్పెన్స్ థ్రిల్లర్ ‘నేత్ర’. లతా సంగ‌రాజు, గీతా సింగ్, బ‌ద్రం, కేదార్‌శంక‌ర్ ప్రధాన పాత్రల‌లో న‌టిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్‌కి సిద్దంగా ఉంది. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్‌ను ‘మా’ అధ్యక్షుడు డా. న‌రేష్, నటుడు శివబాలాజీ విడుద‌ల చేశారు. 

ఈ సంద‌ర్భంగా.. చిత్ర ద‌ర్శకుడు హుస్సేన్ (ఎ.ఎండి) మాట్లాడుతూ.. ‘ముందుగా మా చిత్రం ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేసిన న‌రేష్ గారికి హృద‌య‌పూర్వక ధ‌న్యవాదాలు. ‘నేత్ర’ ఒక స‌స్పెన్స్ థ్రిల్లర్. టైటిల్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. లతా సంగ‌రాజు, గీతా సింగ్, బ‌ద్రం ఇలా ప్రతి ఒక్కరూ వారి క్యారెక్టర్‌లో చాలా బాగా న‌టించారు. ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ర‌ఘునాథ‌న్ సినిమాటోగ్రఫి, రాజ్‌కిర‌ణ్ మ్యూజిక్ సినిమాకు మంచి అసెట్ అయ్యాయి. మా నిర్మాత సుబ్బారెడ్డి గారు సినిమాపై ఎంతో ఫ్యాష‌న్‌తో మాకు కావాల్సిన‌వ‌న్నీ స‌మ‌కూర్చారు. ప్రస్తుతం సెన్సార్‌కి సిద్దంగా ఉంది. త్వర‌లోనే విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి విడుద‌ల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. 

లతా సంగ‌రాజు, గీతా సింగ్, బ‌ద్రం, కేదార్‌శంక‌ర్, సంద్యా జాన‌క్‌, ఆర్యన్, కృష్ణ‌, హ‌న్సిత‌, నిట్టల‌, స్యరూప త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి..

 

డిఓపి : ర‌ఘునాథ‌న్ చ‌క్రవర్తుల‌

సంగీతం : రాజ్‌కిర‌ణ్‌

ఎడిట‌ర్ : వినోద్ అద్వాయ్‌

లిరిక్స్ : అమ్మర‌చ‌న సోమ‌శేఖ‌ర్‌

ప్రొడ‌క్ష‌న్ ఇంచార్జ్: ఎం. నాగరాజు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: మెహ‌బూబ్ భాష‌,

నిర్మాత: బి.వి సుబ్బారెడ్డి,

ద‌ర్శక‌త్వం: హుస్సేన్ ఎ.ఎండి.

Sponsored links

MAA Naresh Released ‘Nethra’ First Look:

MAA Naresh Released ‘Nethra’ First Look

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019