చిరు కోసం అల్లు అర్జున్‌ను పక్కనెట్టేస్తాడా!?

Tue 15th Oct 2019 06:54 PM
allu arjun,mega star chiranjeevi,sukumar,lucifer  చిరు కోసం అల్లు అర్జున్‌ను పక్కనెట్టేస్తాడా!?
News About Allu Arjun and Chiru Movies! చిరు కోసం అల్లు అర్జున్‌ను పక్కనెట్టేస్తాడా!?
Sponsored links

ఇదేంటి.. టైటిల్ చూడగానే ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే.. మెగాస్టార్ చిరంజీవి కోసం స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌ను పక్కనెట్టాలని సుకుమార్ పక్కనెట్టేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం సూపర్‌స్టార్ మహేశ్ బాబు కోసం అనుకున్న కథను అల్లు అర్జున్‌కు వినిపించడం.. ఆయన మార్పులు చేర్పులు చేయాలని చెప్పడం.. సుక్కుగా అది కాస్త ఇబ్బందిగా అనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి కోసం రామ్‌చరణ్.. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ టైటిల్ పాత్రలో న‌టించిన ‘లూసిఫర్’ రీమేక్ హక్కులు కొనుగోలు చేసిన విషయం విదితమే. అంతా ఓకేగానీ.. ఈ సినిమాను ఎవరు తెరకెక్కిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్రమంలో సుకుమార్, సురేందర్ రెడ్డి పేర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే ఎక్కువగా సుకుమారే పక్కా అని మెగా కాంపౌండ్ నుంచి వార్తలు వస్తున్నాయి. ఒక వేళ ఇదే నిజమైతే మరి సుక్కు.. బన్నీని పక్కనెట్టేస్తాడా లేకుంటే అసలు ఆ కథనే తన మైండ్‌లో నుంచి డెలీట్ చేస్తాడా అన్నదానిపై ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద చర్చ జరుగుతోంది.

వాస్తవానికి మొదట సుక్కు.. మహేశ్ కోసం కథ రాసుకోవడం.. ఆ తర్వాత అది వర్కవుట్ కావడంతో బన్నీకి కథ చెప్పడం.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ మార్పులు గురించి చెప్పడం.. అవి పూర్తయినప్పటికీ మళ్లీ రెండోసారి మార్పులు చేయాలని బన్నీనే సలహా ఇవ్వడంతో కాస్త అసంతృప్తికి లోనైన సుక్కు.. ఇక ఇవన్నీ కాదు ఈ కథే వద్దనుకుని.. అల్లూవారబ్బాయిని పక్కనెట్టేసి.. చిరుతో ‘లూసిఫర్’ రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో..? అసలు ఇది జరిగే పనేనా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే మరి.

Sponsored links

News About Allu Arjun and Chiru Movies!:

News About Allu Arjun and Chiru Movies!

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019