‘పూజా’ దెబ్బకు దడుసుకుంటున్న దర్శకనిర్మాతలు!?

Tue 15th Oct 2019 07:12 PM
pooja hegde,shocking remuneration,john movie,ala vaikuntapuramlo  ‘పూజా’ దెబ్బకు దడుసుకుంటున్న దర్శకనిర్మాతలు!?
Pooja Hegde Shocking Remuneration.. ! ‘పూజా’ దెబ్బకు దడుసుకుంటున్న దర్శకనిర్మాతలు!?
Sponsored links

టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేస్తున్న పూజా హెగ్దే గురించి ప్రతిదీ వార్తే. ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ టైమ్ అలా నడుస్తోంది గనుక. నిన్న గాక మొన్నొచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌నే ఏలేస్తోంది.. జూనియర్ల్లు, సీనియర్ అనే తేడా లేకుండా స్టార్ హీరోల సరసన నటిస్తూ.. తన నటనతో అలా ముద్రవేసుకుంది. 

దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా.. అవకాశాలు వస్తున్నాయ్.. అందులో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్నాను కాబట్టి గట్టిగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేసి పుచ్చుకోవాలని పూజా హెగ్దే భావిస్తోందట. అందుకే సినిమా చేయాలని ఆమెను సంప్రదించిన దర్శకనిర్మాతలు పారితోషికం చూసి కంగుతిన్నప్పటికీ కాసింత తేరుకొని ఆ తర్వాత మళ్లీ ఆమెనే ఓకే చేస్తున్నారు.

అప్పుడెప్పుడో ‘ఒక లైలా కోసం’ సినిమాతో మొదలైన టాలీవుడ్‌ పయనం.. ఇప్పుడు ప్రభాస్ ‘జాన్’, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ సినిమాలతో సాగుతోంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ ‘గద్దలకొండ గణేశ్’ సినిమాలో నటించడానికి కోటికిపైగా పుచ్చుకుని.. ప్రభాస్‌తో జోడిగా నటించేందుకు ఏకంగా రెండు కోట్లు తీసుకుంటోందని టాక్. అంతేకాదు.. ‘అల వైలుంఠపురములో’ కోసం రూ. 3 కోట్లు పుచ్చుకుంటోందట. ఇలా సినిమా సినిమాకు అరకోటి.. కోటి రూపాయిలు పెంచేస్తుండటంతో దర్శకనిర్మాతలు దడుసుకుంటున్నారట. మరి జాన్, అలవైకుంఠపురంలో హిట్టయిపోతే ఇక ఈ బ్యూటీ గిరాకీ మామూలుగా ఉండదేమో.

Sponsored links

Pooja Hegde Shocking Remuneration.. !:

Pooja Hegde Shocking Remuneration.. !  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019