Advertisement

‘సైరా’ ఈవెంట్‌లో మెగాబ్రదర్స్ సర్‌ఫ్రైజ్ ఇస్తారా!?

Thu 19th Sep 2019 11:45 AM
mega brothers,surprise,syeera,pre-release event,pawan and chiru  ‘సైరా’ ఈవెంట్‌లో మెగాబ్రదర్స్ సర్‌ఫ్రైజ్ ఇస్తారా!?
Will Mega Brothers Give Surprise From Syeera pre-release Event! ‘సైరా’ ఈవెంట్‌లో మెగాబ్రదర్స్ సర్‌ఫ్రైజ్ ఇస్తారా!?
Advertisement

మెగా బ్రదర్స్.. మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ కమ్ జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ఏం గిఫ్ట్ ఇస్తారా..? అని మెగాభిమానులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు. ఇదేంటి సమయం, సందర్భం లేకుండా గిఫ్టా.. అని ఆశ్చర్యపోతున్నారా..? అలా ఏం కాదండోయ్ సందర్భం ఉంది గనుకే ఫ్యాన్స్ కూడా మెగాబ్రదర్స్ నుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నారట.

ఇక అసలు విషయానికొస్తే.. చిరు-పవన్ ఇద్దరూ ఒకే వేదికపైకి వచ్చిన టైమ్‌లో కచ్చితంగా ఫ్యాన్స్‌తో గిఫ్ట్ అయితే ఉంటుంది.. కనీసం సెల్ఫీ అయినా ఉంటుంది. ఇప్పటికే ‘కాటమరాయుడు’ సినిమా ఈవెంట్‌లో మెగా బ్రదర్స్ మెరిసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అభిమానులతో కలిసి ఈ ఇద్దరూ సెల్ఫీ తీసుకుని.. ఫ్యాన్స్‌ ఉత్సాహం, ఆనందం రెట్టింపు చేశారు. అయితే.. త్వరలో అనగా సెప్టెంబర్ 22న జరగున్న ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మరోసారి ఈ బ్రదర్స్ కలవబోతున్నారు. దీంతో అభిమానులంతా ఏదో ఒక సర్‌ఫ్రైజ్‌ను బ్రదర్స్ నుంచి ఆశిస్తున్నారు.

అయితే ఈసారి బ్రదర్స్ ఇద్దరూ కలిసి స్టేజ్‌పై మళ్లీ ఏం చేయబోతున్నారు..? మళ్లీ సింపుల్‌గా స్టేడియం అంతా కవర్‌ అయ్యేలా మెగా సెల్ఫీ తీసుకుని సరిపెట్టుకుంటారా..? లేకుంటే కొత్త ట్రెండ్ సెట్ చేస్తారా..?  అనేదానిపై మెగాభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. మరి ఫైనల్‌గా మెగా బ్రదర్స్ ఏం చేయబోతున్నారో తెలియాలంటే మరో రెండ్రోజులు వేచి చూడాల్సిందే మరి.

Will Mega Brothers Give Surprise From Syeera pre-release Event!:

Will Mega Brothers Give Surprise From Syeera pre-release Event!  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement