నయన్ ఈసారైనా వస్తుందా..? షాకిస్తుందా..!?

Mon 16th Sep 2019 07:01 PM
nayanatara,syeraa,pre release event,megastar chiranjeevi,tamannah  నయన్ ఈసారైనా వస్తుందా..? షాకిస్తుందా..!?
will Nayan comes sye raa pre release event! నయన్ ఈసారైనా వస్తుందా..? షాకిస్తుందా..!?
Sponsored links

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ తెలుగు‌తో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో అక్టోబర్ 2 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్‌ కూడా అదే రేంజ్‌లో చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే టీజర్ ఈవెంట్, ఇంటర్వ్యూల్లో చిత్రబృందం పాల్గొంటున్నప్పటికీ.. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన లేడీ సూపర్ స్టార్ నయనతార మాత్రం ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. అంతేకాదు ఇలాంటి వాటికి తాను దూరంగా ఉంటానని బాహాటంగానే తేల్చిచెప్పేసింది. 

అయితే.. త్వరలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా జరగబోతున్న ‘సైరా’ ప్రీరిలీజ్ వేడుకకు అయినా నయన్ వస్తుందా? రాదా..? అని అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే స్వయంగానే రామ్‌చరణ్ రంగంలోకి దిగాడట. ‘ఈ ఒక్కసారికి రండి మేడమ్..’ అని కాస్త రిక్వెస్ట్ చేశాడట. చెర్రీ మాటలకు రెండు అడుగులు వెనక్కివేసి మరీ అడగడం.. తాను కాదంటే సబబు కాదని భావించిన నయన్.. కచ్చితంగా వస్తానని మాటిచ్చిందట. 

ఒక్క కోలీవుడ్‌లో మాత్రమే ప్రమోషన్స్‌లో పాల్గొనే ఈ భామ.. తెలుగులో ఇప్పటి వరకూ ప్రమోషన్స్‌కు వచ్చిన సందర్భాలు చాలా తక్కువే. ‘సైరా’ వేడుకకు వస్తే మాత్రం నయన్ అభిమానులకు పండుగే పండుగ.. మాంచి గ్లామర్ టచ్ గట్టిగా ఉంటుంది. ఈ సమాచారంలో ఎంత నిజముందో తెలియట్లేదు. ఒకవేళ నయన్ ఈ ఈవెంట్‌కూ రాకపోతే మళ్లీ ఆ గోల్డెన్‌ ఛాన్స్‌ చేసుకున్న దురదుష్టవంతురాలిగా మిగిలిపోతుంది.. అయితే మిల్కీ బ్యూటీ తమన్నాకే దక్కాల్సిన క్రెడిట్స్ అన్నీ దుక్కుతాయన్న మాట.

Sponsored links

will Nayan comes sye raa pre release event!:

will Nayan comes sye raa pre release event!

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019