పవన్‌ ఈ డైరెక్టర్‌కైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా!

Mon 16th Sep 2019 08:43 PM
pawan kalyan,green signal,sandeep vanga!,arjun reddy  పవన్‌ ఈ డైరెక్టర్‌కైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా!
Will Pawan Gives Green Signal To Sandeep Vanga! పవన్‌ ఈ డైరెక్టర్‌కైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా!
Sponsored links

‘అర్జున్ రెడ్డి’ సినిమా తెరకెక్కించి సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి.. ఒక్క టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోని తన సత్తా ఏంటో చూపించిన సంగతి తెలిసిందే. అందుకే హీరోలంతా ఈయనతో సినిమా కోసం క్యూ కడుతుంటారు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సందీప్ సినిమా చేస్తారని ఇటీవల టాలీవుడ్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. ఇందుకు ఇద్దరి వైపు నుంచీ కారణాలున్నాయి.

వాస్తవానికి పవన్‌కు ‘మైత్రీ మూవీస్’ ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చింది. అయితే పవన్ మాత్రం సినిమా చేయలేదు.. అంతేకాదు తిరిగి అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. దీంతో ఏం చేయాలో ఇటు పవన్‌కు.. అటు మైత్రీ మూవీస్‌ యాజమాన్యంకు దిక్కుతోచట్లేదు. ఇదిలా ఉంటే.. సందీప్ వంగా కూడా అర్జున్ రెడ్డి బ్లాక్ బ్లస్టర్ అయిన తర్వాత ‘మైత్రీ మూవీస్’తో సినిమా చేస్తానని అడ్వాన్స్‌గా కొన్ని కోట్లు పుచ్చుకున్నాడట. నాటి నుంచి సందీప్‌కు సినిమా తీయాలంటే వీలు కాలేదు.. తిరిగి ఇవ్వడానికి మనసు ఒప్పలేదట.

అందుకే ఇవన్నీ ఎందుకులే కానీ.. పవన్-సందీప్‌ల విషయంలో కామన్ ‘అడ్వాన్స్’ గనక ఈ ఇద్దరి కాంబోలో ఓ సినిమా చేయాలని మైత్రీ మూవీస్ ఫిక్స్ అయ్యిందట. ఈ విషయాన్ని సందీప్‌కు చెప్పగా తాను రెడీగా ఉన్నానని చెప్పాడట. పవన్‌ ఓకే అంటే త్వరలోనే కథ వినిపించి.. షూటింగ్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నాడట. అయితే.. ఇప్పటికే పలువురు డైరెక్టర్లు పవన్‌తో సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరి ఈ క్రమంలో సందీప్‌తో గబ్బర్ సింగ్ సినిమా చేస్తాడా లేదా..? సైలెంట్ అయిపోతాడా..? అనేది తెలియాల్సి ఉంది.

Sponsored links

Will Pawan Gives Green Signal To Sandeep Vanga!:

Will Pawan Gives Green Signal To Sandeep Vanga!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019