ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌‌కు ‘బిగిల్‌’ తెలుగు హక్కుల‌ు

Thu 12th Sep 2019 11:27 AM
mahesh koneru,east coast productions,bigil,telugu rights,vijay,nayanthara  ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌‌కు ‘బిగిల్‌’ తెలుగు హక్కుల‌ు
Bigil Movie Telugu Rights to East Coast Productions ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌‌కు ‘బిగిల్‌’ తెలుగు హక్కుల‌ు
Sponsored links

విజ‌య్ ‘బిగిల్‌’ తెలుగు హక్కుల‌ను ద‌క్కించుకున్న ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌

త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా ‘రాజా రాణి’ ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా ‘బిగిల్‌’. ఇది వ‌ర‌కు ఈ హిట్ కాంబినేష‌న్‌లో విడుద‌లైన ‘తెరి’(పోలీస్‌), ‘మెర్స‌ల్‌’(అదిరింది) చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలుగా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీరి క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ చిత్రంగా ‘బిగిల్‌’ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ఈ సినిమాను ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై క‌ల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావ‌ళి సంద‌ర్భ‌గా తెలుగు, త‌మిళంలో సినిమాను ఏక కాలంలో విడుద‌ల చేస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత మ‌హేశ్ కొనేరు మాట్లాడుతూ.. ‘‘బిగిల్‌ సినిమా హ‌క్కులు మా ఈస్ట్ కోస్ట్ బ్యాన‌ర్‌కు ద‌క్క‌డం చాలా ఆనందంగా ఉంది. నిర్మాత క‌ల్పాతి అఘోరామ్‌గారికి, హీరో విజ‌య్‌గారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌. ‘118’తో మా బ్యాన‌ర్‌లో సూప‌ర్‌హిట్ సాధించాం. అలాగే జాతీయ ఉత్త‌మ‌న‌టి కీర్తిసురేశ్‌తో ‘మిస్ ఇండియా’ సినిమాను నిర్మిస్తున్నాం. ఈ నేప‌థ్యంలో మా బ్యాన‌ర్‌లో విజ‌య్, అట్లీ క్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. ఈ ఏడాది రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో ఇదొక‌టి. హీరో విజ‌య్‌గారి కెరీర్‌లో భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది. స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. త్వ‌ర‌లోనే తెలుగు టైటిల్‌ను ప్ర‌క‌టిస్తాం’’ అన్నారు.

న‌టీన‌టులు:

విజ‌య్‌, న‌య‌న‌తార‌, వివేక్‌, జాకీ ష్రాఫ్‌, డేనియ‌ల్ బాలాజీ, అనంత్‌రాజ్ త‌దిత‌రులు

Sponsored links

Bigil Movie Telugu Rights to East Coast Productions:

Mahesh Koneru Bagged Bigil Movie Rights

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019