‘చిన్నాతో ప్రేమగా’ అప్డేట్ ఇదే..!

Thu 12th Sep 2019 11:25 AM
chinnatho premagaa,first schedule,completed,shooting update,sn chinna  ‘చిన్నాతో ప్రేమగా’ అప్డేట్ ఇదే..!
Chinnatho Premagaa Movie Shooting Update ‘చిన్నాతో ప్రేమగా’ అప్డేట్ ఇదే..!
Sponsored links

ఎస్.యన్. ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా ‘చిన్నాతో ప్రేమగా’ అనే చిత్రాన్ని బి. చండ్రాయుడు నిర్మిస్తున్నారు. పీవీఆర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎస్ ఎన్ చిన్నా, హేమంత్, శ్రద్ధ, చైత్ర, నందిని హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రెజంట్ ఈ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ఒక మంచి కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇందులో సీనియర్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఒక ఇంపార్టెంట్ క్యారక్టర్‌తో పాటు మూడు పాటలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ ఈ వారం చివరికల్లా కంప్లీట్ అవుతుంది. మరో మూడు షెడ్యూల్స్‌లో సినిమా పూర్తి చేస్తాం’’ అన్నారు.

దర్శకుడు పీవీఆర్ మాట్లాడుతూ.. ‘‘లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. చిట్టి బాబు కామెడీ, ప్రియాంక క్లాసికల్ డ్యాన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ’’ అన్నారు.

శివ శంకర్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘‘ఇందులో ఒక మంచి క్యారెక్టర్‌తో పాటు మూడు పాటలకు కొరియోగ్రఫీ చేసున్నాను. ఫస్ట్ షెడ్యూల్ చాలా బాగా జరుగుతోంది. దర్శక నిర్మాతలు రాజీ పడకుండా చిత్రీకరిస్తున్నారు’’ అన్నారు.  

శివ శంకర్ మాస్టర్, చిట్టిబాబు జబర్దస్త్ కార్తనందం, గడ్డం చందు, నాగ రాజు, వైజాగ్ శర్మ, ప్రియాంక తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డాన్స్ మాస్టర్స్ : శివ శంకర్ మాస్టర్, ప్రతిభా రాజ్ గౌడ్, కెమెరా: రెబాల సుధాకర్ రెడ్డి, మ్యూజిక్ : రాజ్ కిరణ్ ; నిర్మాత : బి. చండ్రాయుడు, డైరెక్షన్: పీవీఆర్. 

Sponsored links

Chinnatho Premagaa Movie Shooting Update:

Chinnatho Premagaa Movie First Schedule Completed

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019