‘సాహో’ దర్శకుడి మాస్టర్ ప్లాన్ అదిరింది..!

Thu 22nd Aug 2019 01:00 PM
sujith,master plan,saaho director,tollywood,big budget movie,run raja run,director sujeeth  ‘సాహో’ దర్శకుడి మాస్టర్ ప్లాన్ అదిరింది..!
Producers and Heroine Waiting for Saaho Director Sujith ‘సాహో’ దర్శకుడి మాస్టర్ ప్లాన్ అదిరింది..!
Sponsored links

శర్వానంద్‌తో రన్ రాజా రన్ అనే స్మాల్ బడ్జెట్ మూవీ చేసిన దర్శకుడు సుజిత్ కి రెండో సినిమానే బాహుబలి ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమా ఆఫర్ ఇచ్చాడంటే ప్రేక్షకులకి ఇప్పటికీ షాకే. ఇక టాలీవుడ్ ప్రముఖులైన కొందరు.. సుజిత్‌ని ఇలా భారీ బడ్జెట్ మూవీ ప్రభాస్ ఇరికించాడు... సుజిత్ ఈ ప్రాజెక్ట్ చేయగలడా.. అంటూ దీర్ఘాలు తీశారు. కానీ సుజిత్ అంటే ఏంటో సాహో ట్రైలర్ తో నాలుగు భాషల ప్రేక్షకులకే కాదు... ప్రముఖులకు ఓ క్లారిటీ వచ్చేసింది. నిజంగా ప్రభాస్ సాహో ఈవెంట్‌లో చెప్పినట్టుగా సుజిత్ షార్ట్స్ వేసుకుంటే ఇంకా చిన్న అబ్బాయిలానే కనిపిస్తున్నాడు కానీ... ఆ దర్శకుడిలో ఎంత క్రియేటివిటీ దాగుందో సాహో మేకింగ్‌లో చూసాం. అంత భారీ బడ్జెట్‌ని, కథని సుజిత్ ఇప్పటివరకు హ్యాండిల్ చేసిన విధానం నచ్చిన చాలామంది ఇప్పుడు సుజిత్ కి గాలం వెయ్యడానికి సన్నద్దమవుతున్నారనే న్యూస్ నడుస్తుంది.

సాహో సినిమా మేకింగ్‌కే నిర్మాతలు సుజిత్‌కి ఖర్చీఫ్ వేయ్యాలని చూస్తుంటే... సినిమా విడుదలై హిట్ అయితే స్టార్ హీరోలు, బడా నిర్మాతలు సుజిత్ ఇంటిముందు క్యూ కట్టడం గ్యారెంటీ. ఇప్పటికే సుజిత్ వెనకాల పడే హీరోలు, నిర్మాతల లిస్ట్ చాంతాడంత ఉందంటున్నారు. కానీ సుజిత్ మాత్రం సాహో విడుదలయ్యాకే చూద్దామంటూ దాటేస్తున్నాడు కానీ.. ఎవ్వరికి కమిట్మెంట్ ఇవ్వడం లేదట. మరి సాహో విడుదలై సక్సెస్ అయ్యిందంటే.... ఇపుడు తీసుకున్న అడ్వాన్స్ కే చెయ్యాలి... అప్పుడు పెంచెయ్యడం కుదరదు. ఇక సాహో టాక్ తేడా కొడితే అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసి అవమాన పడాలి. ఇదంతా ఎందుకులే అనుకున్న సుజిత్ ప్రస్తుతం కామ్ గా ఉంటూ సాహో.. ప్రమోషన్స్ ని భారీ ఎత్తున చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడట.

Sponsored links

Producers and Heroine Waiting for Saaho Director Sujith:

Excellent Master Plan in Sujith Mind

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019