‘సాహో’, ‘సైరా’ దెబ్బకి టెన్షన్‌లో బాలీవుడ్‌!

Tension in Bollywood With Sye Raa and Saaho

Thu 22nd Aug 2019 11:36 AM
tollywood,bollywood,sye raa,baaubali,saaho,rajamouli,tension  ‘సాహో’, ‘సైరా’ దెబ్బకి టెన్షన్‌లో బాలీవుడ్‌!
Tension in Bollywood With Sye Raa and Saaho ‘సాహో’, ‘సైరా’ దెబ్బకి టెన్షన్‌లో బాలీవుడ్‌!
Advertisement

బాలీవుడ్‌లో ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్.. తాజాగా యంగ్ హీరోలే... సినిమాలని ఓ రేంజ్ లో నిలబెట్టే హీరోలుగా ప్రేక్షకులకు కనబడేవారు. వారు కూడా బడా సినిమాలు చేస్తూ 100,200, 300 కోట్ల క్లబ్బులో తమ సినిమాలను నిలిపి విర్రవీగేవారు. కానీ టాలీవుడ్ నుండి రాజమౌళి తన బాహుబలి దింపి బాలీవుడ్‌కి ఒణుకు పుట్టించాడు. అయినా బాలీవుడ్ హీరోలు టాలీవుడ్‌ని చాలా లైట్ తీసుకున్నారు. కానీ తాజాగా వారికీ టాలీవుడ్ టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే తెలుగు నుండి రెండు భారీ బడ్జెట్ సినిమాలు తమ మీద దాడి చెయ్యడానికి సిద్ధమయ్యాయి. ప్రభాస్ సాహోతో బాలీవుడ్‌ని షేక్ చెయ్యడానికి మరో తొమ్మిది రోజుల్లో రాబోతున్నాడు. ఇక చిరంజీవి మరో నెల రోజుల్లో సై రా నరసింహారెడ్డి తో దుమ్మురేపడానికీ రెడీ అయ్యాడు.

నిన్నమొన్నటి వరకు టాలీవుడ్ ని లైట్ తీసుకున్న బాలీవుడ్.. ఇప్పుడు సాహో, సైరా ప్రమోషన్స్ మొదలయ్యేసరికి టెన్షన్ పడడం స్టార్ట్ చేసింది. తాజాగా టాలీవుడ్ మొత్తం ముంబై లో పాగా వేసింది. సాహో ట్రైలర్ లాంచ్ ముంబై లో గ్రాండ్ గా చేసిన సాహో టీం మిగతా ప్రమోషన్స్ కి ముంబై లోనే మకాం పెట్టింది. తాజాగా సైరా ప్రమోషన్స్ ని సైరా టీం కూడా ముంబై నుండే మొదలెట్టింది. నీకా నాకా అన్న రేంజ్ లో సాహో, సైరా టీమ్స్ తమ సినిమాల ప్రమోషన్స్  కార్యక్రమాలను మొదలు పెట్టేశాయి. 

ఇక ముంబై లో రామ్ చరణ్, చిరు, ప్రభాస్ కలిసి ఫోటో దిగడం, ముగ్గరు బడా హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనబడడం అన్ని ఆయా సినిమాలపై అంచనాలు పెరిగేలా చేశాయి. సాహో మేకింగ్, ట్రైలర్ తోనే సినిమా మీద భారీ అంచనాలు పెరిగాయి. ఒక్క బాలీవుడ్ లోనే సాహో క్రేజ్ ఆకాశాన్నంటింది. ఇక సైరా నరసింహ రెడ్డి టీజర్ కూడా బాలీవుడ్ అంచనాలకు మించి ఉండడంతో ఇప్పుడు ఈ రెండు సినిమాల విషయంలో బాలీవుడ్ షేకవుతుంది. ఈ రెండు సినిమాల్లో ఒక్కటి హిట్ అయినా చాలు.. బాలీవుడ్ సైలెంట్ కావడానికి. చూద్దాం ప్రభాస్ కుమ్ముతాడో... లేదంటే చిరు టాప్ లేపుతాడో.. అనేది.

Tension in Bollywood With Sye Raa and Saaho:

Telugu Stars Targets Bollywood


Loading..
Loading..
Loading..
advertisement