అల్లు అర్జున్ ట్రెండ్ ఫాలో అవ్వట్లే..!

Wed 21st Aug 2019 11:31 PM
allu arjun,low budget,trivikram srinivas,tabu,sukumar,venu sriram  అల్లు అర్జున్ ట్రెండ్ ఫాలో అవ్వట్లే..!
Allu Arjun next Movies Budget Details అల్లు అర్జున్ ట్రెండ్ ఫాలో అవ్వట్లే..!
Sponsored links

టాలీవుడ్ స్టార్ హీరోలంతా భారీ బడ్జెట్ చిత్రాల చుట్టూతా ఉంటే.. అల్లు అర్జున్ మాత్రం కూల్ గా తన మార్కెట్ కి తగ్గ బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలు నేషనల్ వైడ్ గా సినిమాలు చేస్తుంటే... మహేష్ టాలీవుడ్ లోనే భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. కానీ అల్లు అర్జున్ ఇంకా భారీ బడ్జెట్ చిత్రాల మీద ఫోకస్ పెట్టలేదో.. లేదా కాలం కలిసి రావడం లేదో అనేది అర్ధం కావడం లేదు కానీ.... ఏడాది సినిమాలకు దూరంగా ఉండి ఒకేసారి మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో మొదటగా త్రివిక్రంతో చేస్తున్న అలా.. వైకుంఠపురములో సినిమా షూటింగ్ మాత్రం సాగుతుంది. మిగతా రెండు సినిమాలు పట్టాలెక్కాల్సి ఉంది. త్రివిక్రమ్ తో 50 నుండి 70 కోట్ల మధ్యలో సినిమా చేస్తున్న అల్లు అర్జున్.. ఈ సినిమాలో కాస్త అమాయకమైన సాదా సీదా లుక్ లో కనిపిస్తున్నాడు. అల్లు అర్జున్ లుక్ విషయంలో మెగా ఫాన్స్ వర్రీ అవుతున్నారనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. 

అయితే తాజాగా ఈ సినిమాలో బన్నీ కి అత్తగా కీ రోల్ పోషిస్తున్న టబు లుక్ ఒకటి బయటికొచ్చింది. ఆ పిక్ లో టబు.. జయరామ్ ని పట్టుకుని నడుస్తూ చాలా స్టైలిష్ గా పోర్ష్ గా కనబడుతుంది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ హీరో నవదీప్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. నవదీప్ సిక్స్ ప్యాక్ లుక్ గతంలోనే సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇక పొతే అందరి స్టార్ హీరోస్ లా భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించకపోయినా.... తన సినిమా కోసం భారీ సెట్స్ ని మాత్రం అల్లు అర్జున్ వేయించుకున్నాడు. అలా.. వైకుంఠపురములో సినిమా కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో 4.5 కోట్ల ఖర్చుతో భారీ సెట్ ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సెట్ లోనే అలా.. వైకుంఠపురములో సినిమాలోని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ.. సుకుమార్, వేణు శ్రీరామ్ లతో సినిమాలు చెయ్యబోతున్నాడు. మరి ఆ సినిమాలైనా భారీ బడ్జెట్ లతో చేస్తాడేమో చూడాలి.

Sponsored links

Allu Arjun next Movies Budget Details :

Allu Arjun Selected Low Budget Movies

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019