‘సైరా’ విషయంలో అభిమానుల టెన్షన్ అందుకే!

Thu 22nd Aug 2019 01:47 PM
sye raa narasimha reddy,minus points,teaser,chiranjeevi,voice and hair,sye raa  ‘సైరా’ విషయంలో అభిమానుల టెన్షన్ అందుకే!
Mega Fans Tension about Sye Raa Narasimha Reddy ‘సైరా’ విషయంలో అభిమానుల టెన్షన్ అందుకే!
Sponsored links

స్వ‌ాతంత్ర్య పోరాట వీరుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’. ఈ మూవీకి సంబంధించిన టీజర్ మంగళవారం రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాపై నెగిటివ్ ఆలోచనలతో ఉన్న చాలామంది ఈ టీజర్ చూసి షాక్ అయ్యారు. అన్ని భాషల్లో రిలీజ్ అయినా ఈ టీజర్ కి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. టీజర్ మొత్తం చూస్తే యాక్ష‌న్ ఘ‌ట్టాలు, సెట్టింగ్స్, విజువ‌ల్ ఎఫెక్ట్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి అని అర్ధం అవుతుంది.

ఇక ఈమూవీ భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. అంత బాగానే ఉంది కానీ రెండు విష‌యాల్లో మాత్రం తేడా కొడుతోంది. అవే చిరు లుక్ అండ్ తన వాయిస్. ఈ చిత్రంకి చిరుకు స్టైలింగ్ చేసింది స్వ‌యంగా ఆయ‌న త‌న‌యురాలే. ఈమె చిరు రీఎంట్రీ చిత్రం ఖైదీ నంబ‌ర్ 150కి కూడా ప‌ని చేసింది. అయితే సైరాలో ఆమె తో పాటు కొంతమంది నిపుణులు, చ‌రిత్ర‌కారుల సాయం తీసుకుని చిరుకు లుక్ ఫైన‌ల్ చేసిన‌ట్లు స‌మాచారం. కానీ లుక్ చూస్తే బాగోలేదు.

కొన్ని సార్లు బాగానే అనిపిస్తున్నా.. కొన్ని షాట్ల‌లో తేడాగా అనిపించింది. చిరుకి ముఖ్యంగా ఆ హెయిర్ స్టైల్ సెట్ అవ్వలేదు. అలానే చిరు వాయిస్ విష‌యంలో ముందు నుంచి ఉన్న ఆందోళ‌న‌ను తాజా టీజ‌ర్ పెంచింది. ఒక వీరుడి వాయిస్ ఉండాల్సిన‌ట్లుగా లేదు. గొంతు కొంచెం బొంగురుపోయి, బ‌ల‌హీన ప‌డింది. ఈ రెండు విషయాలే అటు ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలను టెన్షన్ పెడుతున్న విషయాలు.

Sponsored links

Mega Fans Tension about Sye Raa Narasimha Reddy :

Sye Raa Narasimha Reddy Teaser Minus Points 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019