హీరోతో డేటింగ్‌పై రష్మిక క్లారిటీ

Sun 18th Aug 2019 10:48 AM
rashmika mandanna,dating,vijay devarkonda,geetha govindam  హీరోతో డేటింగ్‌పై రష్మిక క్లారిటీ
Actress Rashmika mandanna Gives Clarity On Dating హీరోతో డేటింగ్‌పై రష్మిక క్లారిటీ
Sponsored links

టాలీవుడ్‌లో రష్మిక మందన్నా చేసింది తక్కువ సినిమాలే అయినా పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా ‘గీత గోవిందం’ మూవీతో యూత్‌కు బాగా దగ్గరైంది. అలా టాలీవుడ్‌లో రాణిస్తున్న ఈ భామపై అంతే రీతిలో రూమర్స్ కూడా వస్తున్నాయి.. ఆల్రెడీ వచ్చాయి కూడా. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ ఈ రెండు సినిమాల్లో విజయ్‌ దేవరకొండ సరసన నటించడంతో లేని పోని పుకార్లు వచ్చేశాయి. అంతేకాదు.. సరిగ్గా ఈ గ్యాప్‌లోనే పెళ్లి సంబంధం కూడా హుష్ కాకి అనడంతో ఈ పుకార్లకు ఆజ్యం పోసినట్లయ్యింది.

ముఖ్యంగా విజయ్, రష్మికలు డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. దీంతో ఈ వ్యవహారంపై ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇచ్చుకుంది. ‘విజయ్ దేవరకొండ నాకు మంచి స్నేహితుడు మాత్రమే.. అంతకు మించి మా మధ్య ఏమీ లేదు.. పుకార్లు ఎవరూ పట్టించుకోవద్దు’ అని ఈ ముద్దుగుమ్మ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది.

Sponsored links

Actress Rashmika mandanna Gives Clarity On Dating:

Actress Rashmika mandanna Gives Clarity On Dating

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019