సక్సెస్ టూర్‌ని నాగ్ ఎందుకు రద్దు చేశాడు?

Thu 15th Aug 2019 02:38 PM
nagarjuna,manmadhudu 2,success tour,cancelled  సక్సెస్ టూర్‌ని నాగ్ ఎందుకు రద్దు చేశాడు?
Manmadhudu 2 Success Tour Cancelled సక్సెస్ టూర్‌ని నాగ్ ఎందుకు రద్దు చేశాడు?
Sponsored links

నిన్న జరిగిన మన్మథుడు 2 సక్సెస్ మీట్ లో నాగ్ ఈ సినిమా డిజాస్టర్ అంటే ఒప్పుకోవడంలేదు. ఇటువంటి కథలు జనాలకు ఎక్కాలంటే చాలా టైం పడుతుందని నాగ్ అన్నారు. తన గత చిత్రాలు గీతాంజలి, నిర్ణయం లాంటి సినిమాల్ని ఉదాహరణలుగా చూపిస్తున్నాడు. స్లోగా పికప్ అవుతుందని నాగ్ అంటున్నారు. కానీ కలెక్షన్స్ పరంగా చూస్తే ఇది డిజాస్టర్ అని నాగ్ ఒప్పుకోక తప్పదు. రిలీజ్ అయిన రెండో రోజు నుండే కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. నిన్న బక్రీద్ హాలిడే అయినప్పటికీ కలెక్షన్స్ ఏమి రాలేదు.

నిజానికి టీం అంతా టూర్ ప్లాన్ చేసుకున్నారు. స్వయంగా నాగార్జున కొన్ని ముఖ్య పట్టణాల్లో ప్రచారం చేయాలని అనుకున్నాడు. కానీ రోజురోజుకి ఈ సినిమా పరిస్థితి దిగజారిపోవడంతో భారీ నెగెటివ్ టాక్ రావడంతో ఇక ఈ మూవీ కోలుకోవడం కష్టమనే విషయం నాగార్జునకు అర్ధం అయిపోయి టూర్ ను రద్దు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈమూవీ అటుఇటుగా 18 కోట్ల రూపాయలకు అమ్మారు. ఇప్పటివరకు ఈ మూవీకి 9 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 9 కోట్లు రావాలి. కానీ అది కష్టమే అని అర్ధం అయిపోతుంది.

Sponsored links

Manmadhudu 2 Success Tour Cancelled:

No Success Tour to Nagarjuna Manmadhudu 2

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019