హమ్మయ్యా.. ‘కుమారి’కి మంచిరోజులొచ్చాయ్!!

Mon 15th Jul 2019 06:51 PM
hebah patel,nithiin,chance,tollywood  హమ్మయ్యా.. ‘కుమారి’కి మంచిరోజులొచ్చాయ్!!
Struggling heroine finally gets a break? హమ్మయ్యా.. ‘కుమారి’కి మంచిరోజులొచ్చాయ్!!
Sponsored links

‘కుమారి 21 ఎఫ్’ హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఈ ‘21 ఎఫ్‌’ లోని కొన్ని కొన్ని సన్నివేశాలు కుర్రకారును కట్టిపడేశాయి. సినిమా రిలీజ్ అయ్యింది మొదలుకుని ఇప్పటి వరకూ ఈ చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా తక్కువే అన్నట్లుగా ఉంటుంది. సినిమా సంగతి ఓకే కానీ.. సినిమాలో నటించిన కుమారికే ఆ తర్వాత ఆశించినంతగా సినిమా చాన్స్‌లు దక్కలేదు. దీంతో కుమారికి కష్టాలొచ్చి పడినట్లైంది.

టాలీవుడ్‌లో హెబ్బా నటించింది.. అరకొర చిత్రాల్లో మాత్రమే అయినప్పటికీ తన అంద చెందాలతో కుర్రకారును తనవైపు తిప్పుకున్నది. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. అయితే ఈ భామకు తాజాగా.. మంచి ఛాన్స్ దొరికిందని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. నితిన్- వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న చిత్రం ‘భీష్మ’.. ఇందులో హెబ్బాను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సినిమాకు కుమారి పాత్రే ప్రధాన బలం అని సమాచారం.

అయితే అప్పుడెప్పుడో  2016, 2017 ఈ రెండేళ్లలో వరుస చిత్రాలతో గ్యాప్ లేకుండా నటించిన ఆమెకు పాపం.. 2018 మాత్రం ఆశించినంతగా కలిసిరాలేదు. దీంతో ఎంత గ్యాప్ లేకుండా ఒకప్పుడు సినిమాలు వచ్చాయో అంతకు డబుల్ బ్రేకులు పడ్డాయ్. అయితే తాజా సినిమాతో కుమారికి కష్టాలు తొలగి.. మంచి రోజులొచ్చినట్లేనని ఆమె సహచరులు, కుటుంబ సభ్యులు చెప్పుకుంటున్నారట.

Sponsored links

Struggling heroine finally gets a break?:

Struggling heroine finally gets a break?

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019