2019 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన ఇలా తిరిగి తిరిగి వైసీపీ తీర్థం పుచ్చుకున్న టాలీవుడ్ కమెడియన్ అలీకి త్వరలోనే.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక పదవి ఇవ్వబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికల సీజన్‌కు ముందు పలువురు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం విదితమే. వీరిలో పార్టీ కోసం శాయశక్తులా కృషి చేసిన వారికి జగన్ పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి జగన్ కీలక పదవి ఇచ్చిన విషయం విదితమే.
వాస్తవానికి కమెడియన్ అలీకి గుంటూరులో ఏదో ఒక నియోజకవర్గం లేదా రాజమండ్రి నుంచి పోటీచేయాలని భావించారు. అంతేకాదు.. ఆఖరు నిమిషం వరకు టికెట్ కోసం నానా ప్రయత్నాలు చేశారట. అయితే అది కుదరకపోవడంతో అధికారంలోకి రాగానే మీకు మంచి స్థానం కల్పిస్తానని అలీకి జగన్ మాటిచ్చారట.
ఇందులో భాగంగా.. అలీని ఎమ్మెల్సీ చేసి శాసనమండలికి పంపడంతో పాటు.. ‘ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్’గా నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. అంటే ఎమ్మెల్సీతో పాటు చైర్మన్ పదవి కూడా అలీకి జగన్ డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారన్న మాట. కాగా ఇప్పటికే తనను నమ్మి వచ్చిన నేతలందరికీ.. కేబినెట్, పలు పదవులు కట్టబెట్టిన జగన్.. ఇండస్ట్రీలోని వాళ్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే యోచనలో ఉన్నారట. ‘టాలీవుడ్‌లో పదవుల పంపకం’ అనేది పృథ్వీతో ప్రారంభమైందన్న మాట.. అయితే మున్ముంధు పదవులు దక్కించుకునే యాక్టర్స్ కమ్ నేతలు ఎవరో వేచి చూడాలి మరి.





హమ్మయ్యా.. ‘కుమారి’కి మంచిరోజులొచ్చాయ్!!
Loading..