నేను సేఫ్ రాజా.. వైద్యులే బతికించారు: పోసాని

Mon 15th Jul 2019 06:18 PM
posani krishna murali,health,video,clarity  నేను సేఫ్ రాజా.. వైద్యులే బతికించారు: పోసాని
Writer Posani Krishna Murali opens up about his health నేను సేఫ్ రాజా.. వైద్యులే బతికించారు: పోసాని
Sponsored links

టాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళీ అనారోగ్యంపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. కొందరు దీన్నే అదనుగా చేసుకుని పెద్ద పెద్ద కథనాలు, వీడియోస్ చేసేశారు. మరీ ముఖ్యంగా కొందరైతే ఏకంగా పోసాని పరిస్థితి విషమంగా ఉందని కూడా వార్తలు రాసేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై పోసాని ఓ వీడియోలో క్లారిటీ ఇచ్చారు.

‘తెలుగు ప్రజలందరికీ నమస్కారం.. కొన్నాళ్లుగా నా ఆరోగ్యం బాగోలేదని, విషమంగా ఉందని సోషల్‌మీడియాలో వచ్చినట్టు నా ఫ్రెండ్స్ చెప్పారు. నిజమే.. నాకు అనారోగ్యం వచ్చింది.. కానీ చచ్చిపోయేంత కాదు. చూస్తున్నారుగా మీ ముందు నేను మాట్లాడుతున్నాను.. అనారోగ్యం వచ్చింది.. యశోద ఆస్పత్రిలో చేరాను.. వైద్యులు చికిత్స చేసి నన్ను బతికించారు. పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిని చేశారు’ అని పోసాని చెప్పుకొచ్చారు.

అంతటితో ఆగని ఆయన ఇకపై తన ఆరోగ్యం గురించి అభిమానులు, సినీ ప్రియులు ఎలాంటి ఆలోచనలు వద్దని.. మరో వారం పది రోజుల్లోనే మళ్లీ షూటింగ్‌కు వెళ్లబోతున్నానన్నారు. త్వరలోనే మీకు తెరపై కనిపించబోతున్నా అని ఇన్నాళ్లు తన ఆరోగ్యం గురించి కంగారుపడ్డవాళ్లకి.. తన ఆరోగ్యం బాగుండాలని పూజించినవారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ (నమస్కరిస్తూ) పోసాని కృష్ణమురళి ఓ వీడియో విడుదల చేశారు.

Sponsored links

Writer Posani Krishna Murali opens up about his health:

Writer Posani Krishna Murali opens up about his health

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019