రామ్‌ చరణ్‌‌పై మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్.. !!

Mon 15th Jul 2019 02:28 PM
manchu laxmi,instagram,mega power star ramcharan,apple  రామ్‌ చరణ్‌‌పై మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్.. !!
Manchu Laxmi Posts Over mega power Star ramcharan రామ్‌ చరణ్‌‌పై మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్.. !!
Sponsored links

టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌పై మంచు లక్ష్మి ఎమోషనల్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. తన కుమార్తె చెర్రీతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన మంచువారమ్మాయి.. ఎమోషనల్‌ అయ్యేలా రాసుకొచ్చింది. నిజంగా ఈ ఫొటోను తలుచుకుంటే కాలం గిర్రున తిరిగినట్లు అనిపిస్తోందని లక్ష్మి చెబుతోంది. ఇంతకీ ఆమె చెబుతున్న కథేంటో ఇప్పుడు చూద్దాం.

మంచు లక్ష్మికి కుమార్తె ఉందన్న విషయం తెలిసిందే. ఆ పిల్ల పేరే ‘యాపిల్’. తన కుమార్తె చెర్రీతో కలిసున్న ఉన్న ఫొటోను పోస్ట్ చేసి.. ఈ ఫొటో చూస్తే తనకెంతో ఆనందంగా ఉందని.. ఇలాంటి ఫొటోనే తాను మీ నాన్నతో దిగానన్న విషయం గుర్తు చేశారు. అంతేకాదు.. దీన్ని తలుచుకుంటే కాలం గిర్రున తిరిగినట్టు అనిపిస్తుందని.. చెర్రీ మన ప్రయాణం అద్భుతంగా సాగింది. మరిన్ని రోజులు ఇలాగే కొనసాగాలని కోరుకుంది.

అంతటితో ఆగని ఆమె..‘నీకు పిల్లలు పుట్టిన తర్వాత యాపిల్ వాళ్లకి పెద్దక్కలా ఉండాలి. వెల్‌కమ్ టు ఇన్‌స్టా ఫ్యామిలీ’ అని మంచు లక్ష్మి ఎమోషనల్‌గా పోస్ట్ చేసింది. అయితే ఈమె చేసిన ఈ పోస్ట్‌ను సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఉపాసన కొణిదల చూసి ఓ లైక్ వేసుకున్నారు. చెర్రీ మాత్రం ఈ పోస్ట్‌కు ఇంకా రియాక్ట్ అవ్వలేదు. కాగా.. ఇటీవలే చెర్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన విషయం విదితమే. మెగా పవర్‌స్టార్ ఇన్‌స్టాలోకి అడుగుపెట్టి సరిగ్గా వారం రోజులు కూడా కాలేదు.. అప్పుడే ఫాలోయర్ల సంఖ్య 5లక్షలు దాటింది. 

Sponsored links

Manchu Laxmi Posts Over mega power Star ramcharan:

Manchu Laxmi Posts Over mega power Star ramcharan  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019