అసూయ పుట్టిస్తున్న హాట్ యాంకర్ అనసూయ..!!

Mon 15th Jul 2019 02:14 PM
hot anchor anasuya,photos,tollywood,anasuya bharadwaj  అసూయ పుట్టిస్తున్న హాట్ యాంకర్ అనసూయ..!!
News About Hot Anchor Anasuya Photos అసూయ పుట్టిస్తున్న హాట్ యాంకర్ అనసూయ..!!

ఇదిగో ఈ ఫొటోలపై ఓ లుక్కేయండి.. వీటిని చూడగానే అదేదో సాంగ్.. ‘సూయ సూయ.. అనసూయ’ అనే సాంగ్ గుర్తొస్తోంది కదూ. మూడున్నర పదుల వయసు దాటినప్పటికీ గ్లామర్‌ అప్పీల్‌‌తో ఈ హాట్ బ్యూటీ వావ్ అనిపిస్తుంటుంది. అయితే ఈమె అందాలను కొందరు అభిమానులు, నెటిజన్లు.. ‘అందాల భామలకు అసూయ పుట్టించే అందం అనసూయది’ అని కితాబిస్తున్నారు.

అటు బుల్లితెరపై యాంకర్‌గా.. ఇటు సినిమాల్లో హాటెస్ట్‌‌గా పాపులారిటీ దక్కించుకున్నోళ్లు ఎవరైనా ఉన్నారా..? అంటే మొదట గుర్తొచ్చేది అనసూయ పేరే. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ భామ నిత్యం అభిమానులు, తన ఫాలోవర్స్‌తో టచ్‌లో ఉంటూ వస్తుంటుంది. అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఈ హాట్ హాట్ ఫోటోలు చర్చనీయాంశమయ్యాయి.

న్యూ జెర్సీలో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్న అనసూయ.. తన ఫాలోవర్స్‌కి బూస్టప్‌ ఇవ్వడానికి కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలో తొడలు కనిపించేలా పొట్టి నిక్కరేసుకుని, రెండు కాళ్లూ చాచి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. అయితే ఈ ఫొటోలపై కొందరు నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుండగా.. మరికొందరు మాత్రం వావ్ సూపర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

News About Hot Anchor Anasuya Photos:

News About Hot Anchor Anasuya Photos

Latest

Latest

Popular in Times

Contact us    Privacy     © 2019