కొరియన్ అయ్యింది.. సమంత కన్ను ఫ్రెంచ్‌పై!

Sun 14th Jul 2019 06:25 PM
samantha,french comedy film,remake,oh baby,hit  కొరియన్ అయ్యింది.. సమంత కన్ను ఫ్రెంచ్‌పై!
Samantha Eye on French Comedy Film కొరియన్ అయ్యింది.. సమంత కన్ను ఫ్రెంచ్‌పై!
Sponsored links

నందిని రెడ్డి - సమంత అక్కినేని కాంబినేషన్ లో లేటెస్ట్ గా వచ్చిన సూపర్ హిట్ చిత్రం ఓ బేబీ రిలీజ్ అయ్యి రెండు వారాలు కావొస్తుంది.  ఇది ఒక రీమేక్ చిత్రం. ఓ కొరియన్ సినిమా నుండి రైట్స్ తీసుకుని ఈసినిమా తెలుగులో రీమేక్ చేసారు. రీమేక్ సినిమాలు సేఫ్ అనుకుందేమో అందుకే వరసగా రెండు రీమేక్స్ చేసింది సామ్. ఓ బేబీ చిత్రంకి ముందు కన్నడ హిట్ మూవీ యుటర్న్ తెలుగులో చేసింది. ఇక్కడ యుటర్న్ అనుకున్న స్థాయిలో ఆడలేదు.

కానీ కొరియన్ మూవీ మిస్ గ్రానీని తెలివిగా తెలుగీకరించి ఓ బేబీగా తీయడం పెద్ద హిట్టే ఇచ్చింది. మొదటి నుండి ఈసినిమా యొక్క ప్రమోషన్స్ దగ్గరుండి చూసుకున్న సామ్ సినిమా రిలీజ్ తరువాత అంతే ప్రమోట్ చేసింది. అందుకే ఈసినిమాకు వసూళ్లు తగ్గిపోకుండా స్టాండర్డ్ గా వస్తున్నాయి. ఇది హిట్ అవ్వడంతో మరో రీమేక్ పై కన్ను వేసినట్టు తెలిసింది.

ఈసారి ఫ్రెంచ్ కామెడీ తీసుకుంటారట. హీరో పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా కేవలం సామ్ చుట్టే  కథ తిరుగుతుందని తెలిసింది. ఈసారి కూడా డైరెక్టర్ గా నందిని రెడ్డే అంట. మరి ఈసినిమా రైట్స్ తీసుకుని అఫీషియల్ గా రీమేక్ చేస్తారా? లేదా లేపేస్తారా? అనేది తెలియాల్సిఉంది. స్క్రిప్ట్ మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిన తరువాతే ఈసినిమా గురించి బయటకు చెబుతారట. దీన్ని సామ్ సురేష్ బాబుతో నిర్మించనుంది. మరి ఇలా రీమేక్స్ చేసుకుంటూ వెళ్తే స్ట్రెయిట్ సినిమాలు ఎప్పుడు చేస్తుందో..

Sponsored links

Samantha Eye on French Comedy Film:

Samantha plans One More Remake

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019