రాజశేఖర్ కూతుళ్ల ఫేట్ ఇలా ఉంది..!

Shivani and Shivathmika Rajashekar Fate at Box Office

Sun 14th Jul 2019 06:31 PM
Advertisement
shivani,shivathmika,movies,box office  రాజశేఖర్ కూతుళ్ల ఫేట్ ఇలా ఉంది..!
Shivani and Shivathmika Rajashekar Fate at Box Office రాజశేఖర్ కూతుళ్ల ఫేట్ ఇలా ఉంది..!
Advertisement

రాజశేఖర్ కూతుళ్లు.. మెడిసిన్ చదివి మరీ హీరోయిన్స్ గా టాలీవుడ్ కి తెరంగేట్రం చేశారు. పెద్ద కూతురు శివాని.. అడివి శేష్ హీరోగా 2 స్టేట్స్ రీమేక్ ద్వారా టాలీవుడ్ కి దిగుదామనుకుంది. కానీ దర్శకుడుకి నిర్మాతకు వచ్చిన అభిప్రాయం బేధాల వలన ఆ సినిమా అటకెక్కింది. ఇక రెండో కూతురు శివాత్మిక.... విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమవుతున్న దొరసాని సినిమాతో తెరంగేట్రం చేసింది. దొరసాని నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  దొరసాని సినిమాకి యావరేజ్ టాక్ వచ్చిన.. క్రిటిక్స్ కూడా కాస్త పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు.

ఆనంద్ దేవరకొండ.. శివాత్మిక ఈ సినిమాకి కొత్త. అసలు ఆనంద్ కానీ శివాత్మిక కానీ ప్రేక్షకులు ఊహించుకునే హీరో హీరోయిన్స్ గా ఈ సినిమాకి కనబడరు. అంత నార్మల్ లుక్స్ లో ఉంటారు. కానీ నటన పరంగా వీళ్లిద్దరికీ మంచి మార్కులే పడతాయి. తమ పాత్రలకు వీళ్లిద్దరూ చక్కగా సరిపోయారు. శివాత్మిక నటన సైతం సహజంగా.. పాత్రకు తగ్గట్లుగా సాగి మెప్పిస్తుంది. 

ఇక ఆనంద్ - శివాత్మిక కెమిస్ట్రీ సినిమాలో మేజర్ హైలెట్ గా చెప్పొచ్చు. శివాత్మిక‌ని ప‌క్క‌న పెట్టి దొర‌సాని పాత్ర ఊహించ‌లేం. త‌ను అంత చ‌క్క‌గా ఒదిగిపోయింది. న‌టించే స్కోప్ ద‌ర్శ‌కుడు శివాత్మిక‌కు చాలా త‌క్కువ ఇచ్చాడు. త‌న‌కు డైలాగులు కూడా త‌క్కువే. కేవ‌లం చూపుల‌తోనే హావ‌భావాలు పలికించింది. మరి ఈ సినిమా పూర్తి కాకుండానే శివాత్మికకు రెండు సినిమాల ఛాన్స్ వచ్చిన.. దొరసాని ఫలితం చూసాకే ఒప్పుకోవాలనుకుంది. మరి దొరసానమ్మగా అలరించిన శివాత్మిక ఇప్పుడు రెండు మూడు సినిమాలతో బిజీ కావడం మాత్రం పక్కా.

Advertisement

Shivani and Shivathmika Rajashekar Fate at Box Office:

Shivani Movie Stopped.. Shivathmika Movie Released

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement