మొదటి సినిమానే బెడిసికొట్టిందిగా..!

Sun 14th Jul 2019 06:20 PM
srihari son,meghamsh,raj dhoot,failed,box office  మొదటి సినిమానే బెడిసికొట్టిందిగా..!
Negative Talk to Srihari Son Movie Raj Dhoot మొదటి సినిమానే బెడిసికొట్టిందిగా..!
Sponsored links

ఈ శుక్రవారం కూడా ప్రతి శుక్రవారంలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈసారి స్ట్రెయిట్ తెలుగు సినిమాలు మూడు రిలీజ్ అయ్యాయి. సందీప్ కిషన్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నిన్ను వీడని నీడను నేనే, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తొలిచిత్రంగా ‘దొరసాని’ చిత్రాలతో పాటు మరో చిన్న సినిమా రిలీజ్ అయింది.

నటుడు శ్రీహరి కొడుకు మేఘాంశ్ శ్రీహరి తొలి చిత్రంగా వచ్చిన ‘రాజ్ దూత్’ కూడా రిలీజ్ అయింది. అయితే సందీప్, ఆనంద్ దేవరకొండ సినిమాలకు ఓ ప్లాన్డ్ గా సోషల్ మీడియాలో ప్రచారం సాగించారు. సెలబ్రిటీస్ కూడా ఈరెండు చిత్రాలని ప్రమోట్ చేయడంతో సినిమాకు కొంత బజ్ వచ్చింది. అది ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించింది.

కానీ పాపం తెలుగు రాష్ట్రాల్లో రాజ్ దూత్ కు మినిమమ్ ఓపెనింగ్స్ రాలేదు. అసలు ఈసినిమా వచ్చినట్టు చాలామందికి తెలియదు కూడా. దీనికి ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల చాలా మైనస్ అయిందనే చెప్పాలి. దొరసాని సినిమాకి రీజనబుల్ ఓపెనింగ్స్ వచ్చాయి. నిను వీడను నేనే సినిమాకు మరీ అద్భుతం కాకపోయినా, ఓ మాదిరిగా మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఓవరాల్ గా ఈ రెండు చిత్రాలు సేఫ్ జోన్ లోకి వెళ్లే అవకాశముందని ట్రేడ్ అంచనా వేస్తుంది.

Sponsored links

Negative Talk to Srihari Son Movie Raj Dhoot :

Srihari Son Meghamsh Raj Dhoot Failed at Box Office

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019