‘ఇస్మార్ట్ శంకర్’ ప్రీ రిలీజ్ బిజినెస్ డిటైల్స్!

Sun 14th Jul 2019 06:05 PM
ram,ismart shankar,table profit  ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రీ రిలీజ్ బిజినెస్ డిటైల్స్!
ISmart Shankar Pre Release Business ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రీ రిలీజ్ బిజినెస్ డిటైల్స్!
Sponsored links

రామ్ - పూరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. రీసెంట్ గా ఈసినిమా యొక్క  బిజినెస్ క్లోజ్ అయింది. సాంగ్స్, టీజర్స్, ట్రైలర్స్ ఇలా అన్నీ ప్రమోషన్స్ బాగానే వర్క్ అవుట్ అయినట్టు ఉంది. ఈమూవీ తెలుగు రాష్ట్రాలు మొత్తం మీద నలుగురు బయ్యర్లకు విక్రయించారు. నైజాం రైట్స్ ఆరుకోట్లకు పైగా వరంగల్ కు చెందిన ఓ బయ్యర్ దక్కించుకున్నారు అని సమాచారం.

అలానే ఆంధ్రా రైట్స్ కూడా దాదాపు ఆరుకోట్లకు కొన్నారని టాక్ నడుస్తుంది. గుంటూరు, వెస్ట్ మినహా మిగిలిన ఏరియాలు అన్నీ అభిషేక్ పిక్చర్స్ అధినేత  అభిషేక్ నామా తీసుకున్నారు. సీడెడ్ రైట్స్ ఫైనాన్షియల్ లావాదేవీల్లో భాగంగా శోభన్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

అలా ఈసినిమా యొక్క థియేట్రికల్ రైట్స్ మొత్తం ఆ విధంగా క్లోజ్ అయింది. ఇక ఓవర్సీస్ రైట్స్  గ్రేట్ ఇండియా ఫిలింస్ కు పంపిణీకి ఇచ్చారు. ఓవరాల్ గా నిర్మాత ఛార్మికి థియేట్రికల్ రైట్స్ రూపంలో మరి ఎక్కువ రాకపోయినా టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్టు ఉంది. ఇక ఈసినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ క్లోజ్ అవ్వాలి.

Sponsored links

ISmart Shankar Pre Release Business:

Ismart Shankar in Table Profit

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019