Advertisementt

‘ఎర్ర‌చీర’.. పాటేసుకుంటున్నారు!

Sun 14th Jul 2019 12:47 PM
erra cheera,movie,latest,update  ‘ఎర్ర‌చీర’.. పాటేసుకుంటున్నారు!
Erra Cheera in Song Shooting Stage ‘ఎర్ర‌చీర’.. పాటేసుకుంటున్నారు!
Advertisement
Ads by CJ

శ‌తాధిక చిత్రాల హీరో శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర‌లో బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘ఎర్ర‌చీర’. సత్య సుమన్‌ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. హార‌ర్ యాక్షన్ స‌స్పెన్స్ ప్ర‌ధానంగా రూపొందుతున్న‌ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. సెప్టెంబ‌ర్ 20న సినిమా రిలీజ్ కానుంది. మ‌హాన‌టి ఫేమ్ బేబి సాయి తేజ‌స్వి మ‌రో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. సార‌ధి స్టూడియోస్ లో హీరోయిన్ ప్రియాంక‌ అగ‌స్టిన్ - ర‌ఘుబాబు- ఫిష్ వెంకట్ స‌హా గ్రూప్ పై ఐటమ్ పాట చిత్రీక‌రిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు సత్య సుమన్‌ బాబు మాట్లాడుతూ- ‘‘ఎర్రచీర‌లో శ‌తాధిక చిత్రాల హీరో శ్రీ‌కాంత్.. బేబి సాయి తేజ‌స్విని, కారుణ్య చౌదరి, ర‌ఘుబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌మల్ కామ‌రాజు, అజ‌య్, శ్రీ‌రామ్.. అలీ పాత్ర‌లు ఆక‌ట్టుకుంటాయి. ఛేజింగ్‌ సీన్స్‌, హారర్‌, కామెడీ హైలెట్ గా నిలుస్తాయి. త్వ‌ర‌లో క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేయ‌నున్నాం. సైమ‌ల్టేనియ‌స్ గా నిర్మాణానంత‌ర ప‌నులు పూర్త‌వుతున్నాయి. సెప్టెంబ‌ర్ 20న సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత తోట సతీష్‌ మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు చివరి నాటికి అన్ని ప‌నులు పూర్తి చేసి సెప్టెంబ‌ర్ 20న రిలీజ్ చేస్తున్నాం’’ అని తెలిపారు. 

ఈ చిత్రానికి మాట‌లు:  గోపీ విమ‌ల పుత్ర‌, కెమెరా: చ‌ందు, ఫైట్స్: న‌ందు, క‌ళ‌:  సుభాష్‌- నాని, క‌థ‌-క‌థ‌నం-ద‌ర్శ‌క‌త్వం:  సత్య సుమన్‌ బాబు.

Erra Cheera in Song Shooting Stage:

Erra Cheera Movie Latest update

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ