సూపర్‌స్టార్ మహేశ్ ఎవరో నాకు తెలియదు!

Tue 25th Jun 2019 02:39 PM
mahima chaudary,bollywood,mahesh babu,namratha  సూపర్‌స్టార్ మహేశ్ ఎవరో నాకు తెలియదు!
i Dont no Who is Mahesh Babu: Heroine సూపర్‌స్టార్ మహేశ్ ఎవరో నాకు తెలియదు!
Sponsored links

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి తెలియని వారుండరు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రిన్స్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. మరీ ముఖ్యంగా లేడీ ఫ్యాన్సే.. మహేశ్‌కు ఎక్కువగా ఉన్నారు. అయితే అలనాటి మోడల్, బాలీవుడ్ హీరోయిన్ మహిమా చౌదరికి మాత్రం.. మహేశ్ ఎవరో తెలియదట.

హైదరాబాద్‌కు విచ్చేసిన మహిమా చౌదరి ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రియదర్శన్, నాగార్జున తెలుసు.. నమ్రత కూడా తెలుసు కానీ.. మహేశ్ బాబు మాత్రం తెలియదని చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూ చూసిన సూపర్ స్టార్‌ ఫ్యాన్స్ ఒకింత కంగుతిన్నారట. 

నమ్రత తెలియడమేంటి..? మహేశ్ తెలియకపోవడమేంటి..? అంటూ ఘట్టమనేని అభిమానులు ఒకింత ఆగ్రహానికి లోనవుతున్నారు. మరికొందరు మాత్రం పోన్లేండి తెలియదు అంటున్నారుగా.. ఇక తెలుసుకోండి మహిమా.. అంటూ కొందరు నెటిజన్లు సలహాలిస్తున్నారు. అయితే మహిమా వ్యాఖ్యలపై ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు సరే.. నమ్రత ఎలా రియాక్ట్ అవుతుందో.. లేకుంటే అందరూ తెలియాలని ఏముందిలే అని లైట్ తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

Sponsored links

i Dont no Who is Mahesh Babu: Heroine:

Bollywood Heroine Sensational Comments on Mahesh Babu

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019