ఆర్జీవీ ‘శివ’ సినిమాలో పూరీ జగన్.. గమనించారా!

Tue 25th Jun 2019 02:50 PM
pam gopal varma,siva movie,puri jagannadh,working still,social media  ఆర్జీవీ ‘శివ’ సినిమాలో పూరీ జగన్.. గమనించారా!
Puri Jagannadh in RGV Siva Movie ఆర్జీవీ ‘శివ’ సినిమాలో పూరీ జగన్.. గమనించారా!
Sponsored links

అక్కినేని నాగార్జున, అమల నటీనటులుగా టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘శివ’. ఈ సినిమా ఏ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ అయ్యిందో..? 28 ఏళ్ల క్రితం ఎన్నిసినిమాల రికార్డ్స్ బ్రేక్ చేసిందో.. ట్రెండ్ ఏ రేంజ్‌లో సృష్టించిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. గతం గత: ఇప్పుడెందుకు ఇవన్నీ చెబుతున్నారని అనుకుంటున్నారా. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఆర్టికల్ చదివేయండి అసలు విషయమేంటో మీకు తెలుస్తుంది.

‘శివ’ సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడంతో హిందీ వెర్షన్‌లోనూ తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో మాస్‌ సినిమాల దర్శకుడు పూరీ జగన్నాథ్‌ నటించారంట. ఇదేంటి.. ఈ సినిమా ఎన్నోసార్లు చూశాం ఎక్కడా కనిపించలేదే అనుకుంటున్నారా..? అవునా.. మీరు వింటున్నది నిజమే ఈ విషయం ఈ సినిమా తెరకెక్కించిన ఆర్జీవీనే చెప్పాడండోయ్. జనాలు నమ్ముతారో నమ్మరో అని ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ కూడా తగిలించారు వర్మ.

ఒక్కసారి ఆర్జీవీ ట్విట్టర్ ఖాతాలోకి వెళ్లి వీడియో క్లిక్ చేస్తే.. అందులో డ్యాన్స్ చేస్తూ బ్లూ షర్టులో కనిపించే వ్యక్తిని కాస్త నిశితంగా గమనిస్తే పూరీనా కాదా అన్న విషయం మీకే తెలిసిపోతుంది. ‘టాలెంట్‌ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి దర్శకుడు పూరీ జగన్నాథ్‌ నిదర్శనం’ అంటూ ఆర్జీవీ తన ట్విట్ట్‌ర్‌ వేదికగా తన శిష్యుడైన పూరీని అభినందించారు. ఇందుకు స్పందించిన పూరీ.. ఎస్....... సార్ అంటూ నవ్వుతూ... నమస్కరిస్తున్న ఎమోజీలను పోస్ట్ చేశారు. మరోవైపు  ఈ ట్వీట్ చూసిన ఆర్జీవీ, పూరీ జగన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. 

Sponsored links

Puri Jagannadh in RGV Siva Movie:

RGV Posted Siva Movie Working Still

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019