సానియా కొడుకు ఇజ్జూతో ఉపాసన ఎంజాయ్

Tue 25th Jun 2019 02:22 PM
upasana,enjoy,sania mirza,kid,holiday trip  సానియా కొడుకు ఇజ్జూతో ఉపాసన ఎంజాయ్
Sania Mirza in Upasana hands సానియా కొడుకు ఇజ్జూతో ఉపాసన ఎంజాయ్
Sponsored links

టాలీవుడ్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన లండన్ పర్యటనలో బిజిబీజీగా గడుపుతున్నారు. అయితే ఇదే పర్యటనలో టెన్నిస్ తార సానియా మీర్జా కలిసింది. చిన్న పిల్లలు, జంతువులు అంటే బాగా ఇష్టపడే ఉప్సీ.. సానియా కొడుకుతో లండన్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. వాస్తవానికి వీరిద్దరూ మంచి స్నేహితులు.. ఉప్సీ క్రీడాభిమాని. వరల్డ్ కప్ చూసేందుకు వెళ్లిన ఈ ఇద్దరూ లండన్‌లో కలుసుకుని వీధుల్లో విహరించారు. 

ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులతో ఉపాసన పంచుకున్నారు. ఈ ఫొటోల్లో సానియా కొడుకు ఇజాన్‌ను ఎత్తుకుని బ్రెడ్ తినిపిస్తున్నట్లుగా ఉంది. మరో ఫొటోలో సానియా, ఉప్సీతో పాటు సానియా చెల్లి ఆనమ్, అసద్ కూడా ఉన్నారు.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన మెగాభిమానులు ఇజ్జూతో ఫుల్‌గా ఎంజాయ్ చేసినట్లున్నారుగా మేడం.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు వామ్మో పిల్లలంటే ఉప్సీకి ప్రాణం అనుకుంటా.. త్వరలో మీరు కూడా మెగా వారసుడ్ని ఇవ్వండి మేడమ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

Sponsored links

Sania Mirza in Upasana hands:

Upasana Enjoy with Sania Mirza’s kid in Holiday Trip

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019