పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టిన అల్లు అర్జున్!

Mon 27th May 2019 08:13 PM
allu arjun,rumors,trivikram  పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టిన అల్లు అర్జున్!
Allu Arjun Reacts On Rumors పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టిన అల్లు అర్జున్!
Sponsored links

చాలా గ్యాప్ తీసుకుని బన్నీ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఫామిలీ ఎంటెర్‌టైనర్ చేస్తున్నాడు. ఆల్రెడీ షూట్ ప్రారంభమై, రెండు ఫైట్లు తీసి గ్యాప్ ఇచ్చారు. ఈమూవీని హారిక హాసిని, గీతా కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఫినిషింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులు నుండి సినిమా షూటింగ్‌కి గ్యాప్ వచ్చిందని.. త్రివిక్రమ్‌- బన్నీకి సరిగా పడట్లేదని ఏవేవో పుకార్లు ఫిల్మ్‌నగర్‌లో గుప్పుమన్నాయి.

అయితే ఈ పుకార్లకు ఫుల్ స్టాప్‌ పెడుతూ.. ఈ నెల 29 నుంచి ఓ లెంగ్తీ షెడ్యూలుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 29న ప్రారంభించి వచ్చేనెల 26 దాటే వరకు అంటే దాదాపు 30 రోజుల షెడ్యూలును కేవలం హైదరాబాద్ పరిసరాల్లోనే ప్లాన్ చేస్తున్నారు. దీంతో ముప్పై శాతం షూటింగ్ అయిపోతుందని చెబుతున్నారు.

ఈ షెడ్యూల్‌లో దాదాపు కీలక నటులంతా పాల్గొంటారు. హైదరాబాద్ లో లోకేషన్ల రెక్కీ ఫినిష్ చేసారు. బన్నీ సరసన మరోసారి పూజా నటిస్తున్న ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

Sponsored links

Allu Arjun Reacts On Rumors:

Allu Arjun Reacts On Rumors

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019