లారెన్స్‌ను మరింత హర్ట్ చేశారట!

Mon 27th May 2019 08:21 PM
raghava lawrence,hurt,kanchana  లారెన్స్‌ను మరింత హర్ట్ చేశారట!
Raghava Lawrence Again Hurt kanchana remake లారెన్స్‌ను మరింత హర్ట్ చేశారట!
Sponsored links

కాంచన.. ఈమూవీ సౌత్ ఇండియాలో ఓ ఊపు ఊపింది. ఇప్పుడు ఈసినిమా బాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది. ఒరిజినల్ సినిమా తీసినా దర్శకుడు రాఘవ లారెన్స్ కొంత భాగం వరకు హిందీ రీమేక్‌ను షూట్ చేసారు. కానీ తనకు తెలియకుండా నిర్మాతలు ‘లక్ష్మీబాంబ్’ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడంతో హర్టయి సినిమా నుంచి వైదొలిగాడు.

అయితే అతను హర్ట్ అయినా విషయం ప్రొడ్యూసర్స్ ఏమి పటించుకోకుండా మరో ఆప్షన్‌ని వెతికోవడంతో మరింత హర్ట్ అయ్యాడు లారెన్స్‌. కనీసం అతన్ని బుజ్జగించే ప్రయత్నం ఏదీ చేయలేదని స్పష్టమవుతోంది. లారెన్స్ వైదొలిగిన వారం రోజుల్లోనే అతడి రీప్లేస్మెంట్ రెడీ అయిపోవడం విశేషం. ఈమూవీకి రచయితగా పని చేస్తున్న ఫర్హద్ సంజికి ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు కూడా అప్పగించారు.

ఇతను ఓ ప్రముఖ రైటర్. ఫర్హద్.. సాజిద్ అనే మరో రచయితతో కలిసి ఎన్నో చిత్రాలకు రచన అందించాడు. వీరిద్దరూ కలిసి ‘హౌస్ ఫుల్’ సిరీస్‌లో రెండు చిత్రాలకు డైరెక్షన్ కూడా చేశారు. కామెడీ రాయడంలో వీరు ఎక్స్పర్ట్స్. అందుకే ఏమి ఆలోచించకుండా నిర్మాతలు డైరెక్షన్ బాధ్యతలు ఫర్హద్‌కు  అప్పగించారు. మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే లారెన్స్‌ను పొమ్మనకుండా పొగబెట్టేశారేమో అని కూడా అనిపిస్తోంది.

Sponsored links

Raghava Lawrence Again Hurt kanchana remake:

Raghava Lawrence Again Hurt kanchana remake

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019